ETV Bharat / business

బంగారాన్ని ఎన్ని రూపాల్లో కొనొచ్చో తెలుసా? ఈ ట్యాక్స్​ల గురించి అవగాహన ఉందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 7:56 AM IST

gold investment tax
Tax On Gold Buying

Tax On Gold Buying : సాధారణంగా కొంతమంది వివిధ బాండ్లలో, మ్యూచువల్ ఫండ్స్​లో, గోల్డ్ ఈటీఎఫ్​ల్లో బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. అయితే పసిడి కొనుగోలు/పెట్టుబడులపై పన్ను చెల్లించాలనే విషయం మీకు తెలుసా? అసలు.. సాధారణ బంగారం, డిజిటల్ గోల్డ్, పేపర్​ గోల్డ్​ అంటే ఏంటి? వాటిపై ఆదాయ పన్ను ఎంత చెల్లించాలి? పన్ను మినహాయింపు ఎటువంటి వాటికి ఉంటుంది? పన్ను మినహాయింపు పొందాలంటే ఏం చేయాలనే వివరాలు మీ కోసం.

Tax On Gold Buying : బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతుండటం వల్ల కొంతమంది పసిడిని కొనుగోలు చేసేందుకు/పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఆభరణాలే కాకుండా అనేక రూపాల్లో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, బంగారంపై పెట్టే పెట్టుబడులపై ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏఏ సందర్భాల్లో పన్ను చెల్లించాలి? డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్, ఫిజికల్ బంగారం అంటే ఏంటి? పన్ను మినహాయింపులు ఏమైనా ఉన్నాయా లాంటి విషయాలు తెలుసుకుందాం.

  • డిజిటల్ గోల్డ్ : లాకర్​ సదుపాయాన్ని కల్పించే కల్పించే బీమా సంస్థలతో ఆన్​లైన్​ ద్వారా కొంతమంది బంగారాన్ని కొనుగోలు/పెట్టుబడులును చేస్తుంటారు. ఈ పద్ధతినే డిజిటల్ గోల్డ్​గా వ్యవహరిస్తున్నాం. ఈ తరహా పెట్టుబడులపై ఆర్​బీఐ, సెబీ(సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్​ ఆఫ్ ఇండియా)ల నియంత్రణ ఉండదని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్​, పేపర్ గోల్డ్​ కొనుగోలుపై ఆదాయపుపన్నుశాఖ నిబంధనల ప్రకారం 20.8శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. బంగారంతోపాటు, బాండ్స్​ రూపంలో కొనుగోలుచేసిన పసిడి(పేపర్​ గోల్డ్​)కి 20.8శాతం పన్ను చెల్లించాలని తెలిపారు.
  • బంగారం : సాధారణంగా చాలా మంది ఆభరణాలు, కాయిన్స్, బిస్కెట్ల రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఆదాయపుపన్ను చట్టం ప్రకారం ఇలాంటి వివిధ రూపాల్లో ఉన్న బంగారం అమ్మకంపై 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్​టర్మ్ క్యాపిటల్​ గెయిన్ (దీర్ఘకాలిక మూలధన లాభాలపై) 4% సెస్​తో కలిపి మొత్తం 20.8% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సెస్ స్వల్పకాలిక మూలధన లాభాలకు వర్తించదు. 36 నెలలకంటే ఎక్కువ సమయం బంగారం కలిగి ఉండేదాన్ని ఎల్​టీజీసీ అంటారు.

పేపర్​గోల్డ్​పై ట్యాక్స్ ఎంతంటే?
మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్​ ఈటీఎఫ్​లు(ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్​ ఫండ్స్), సావరిన్ బాండ్ల రూపంలో పేపర్​గోల్డ్ ఉంటుంది. ఈటీఎఫ్​లు, మ్యూచువల్ ఫండ్స్​ను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన లాభంగా వ్యవహరిస్తారు. ఆదాయపుపన్ను శాఖ బంగారంపై విధించే పన్నునిబంధనల ప్రకారం వారు 20.8% చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల కంటే తక్కువ హోల్డింగ్ వ్యవధి ఉన్నవారు వారి వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్​ రేట్ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను మినహాయింపు లభించేవి ఇవే
వారసత్వంగా లభించినటువంటి బంగారంపై పన్ను మినహాయింపులు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని 56(2) నిబంధన ప్రకారం తల్లిదండ్రులు, జీవితభాగస్వాముల నుంచి పిల్లలకు బంగారం రూపంలో లభించే కానుకలు ఆదాయ పన్ను పరిధిలోకి రావని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల నుంచి వచ్చే బంగారు బహుమతులుపై ఇతరేతర ఆదాయమార్గాలు అనే విభాగం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివాహ కానుకలుగా ఇచ్చిన వాటికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అంటున్నారు. అయితే ఇతరులనుంచి వచ్చే కానుకల విషయంలో రూ.50,000 మించితే పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఎన్​ఆర్​ఐలు బంగారంపై పెట్టే పెట్టుబడులపై
ఆదాయ పన్ను చట్టం ప్రకారం బంగారం, డిజిటల్ గోల్డ్, పేపర్​ గోల్డ్​ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస భారతీయుల(ఎన్​ఆర్​ఐ)కు అనుమతించినప్పటికీ సావరిన్ బండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశంలేదు. బంగారం అమ్మకాలపై వారు చెల్లించాల్సిన పన్నును భారతీయ పౌరుల మాదిరిగానే చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక రాబడిపై 30శాతం, దీర్ఘకాలిక రాబడిపై 20శాతం రేటును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సాధారణంగా బంగారంలో పెట్టుబడులకు ఆదాయపు పన్ను వర్తిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని 54EE, 54F సెక్షన్​లలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఈ సెక్షన్లను అనుసరించడం ద్వారా ఆదాయపు పన్ను నుంచి కొంత వరకు మినహాయింపులను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

How much Gold We Can Buy in Cash? : ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.. పరిమితి దాటితే..!

Income Tax Investment Plan : ఆదాయం ఎక్కువగా.. పన్ను తక్కువగా ఉండాలా?.. ఇలా ప్లాన్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.