ETV Bharat / business

Stock Market Close Today 20th September 2023 : స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. 20K పాయింట్ల దిగువకు నిఫ్టీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 4:01 PM IST

Updated : Sep 20, 2023, 4:31 PM IST

Share Market Close Today 20th September 2023
Stock Market Close Today 20th September 2023

Stock Market Close Today 20th September 2023 : దేశీయ స్టాక్ ​మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 20,000 పాయింట్ల కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడమే ఇందుకు కారణం.

Stock Market Close Today 20th September 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం కూడా ఇందుకు కారణం. దీనికితోడు యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ త్వరలో​ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో.. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం కూడా.. మాార్కెట్ పతనానికి మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 796 పాయింట్లు నష్టపోయి 66,800 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 19,901 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన షేర్స్​: పవర్​గ్రిడ్​, ఏషియన్ పెయింట్స్​, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, టీసీఎస్​
  • నష్టపోయిన స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, టాటా స్టీల్​, మారుతి సుజుకి, విప్రో, టైటాన్​

భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, ఆయిల్ స్టాక్స్​
బుధవారం దేశీయ బ్యాంకింగ్​, ఆయిల్ స్టాక్స్​ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 4 శాతం మేర నష్టపోయింది. దీనితోపాటు ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, కోటక్​ బ్యాంక్​, రిలయన్స్, ఐఓసీ, బీపీసీఎల్​.. కూడా నష్టాలను చవిచూశాయి.

ఆసియా మార్కెట్లు
Asian Markets Today 20th September 2023 : బుధవారం టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్క సియోల్ స్టాక్​ మార్కెట్​ మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కింది.

గ్లోబల్ మార్కెట్స్​
Global Markets Today 20th September 2023 : మంగళవారం యూఎస్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అయితే ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మాత్రం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి!
ఎక్స్ఛేంజ్​ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.1,236.51 కోట్లు విలువైన పెట్టబడులను భారత్​ నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది కూడా దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీనితో వరుసగా 11 రోజుల లాభాలకు నేటితో బ్రేక్ పడింది.

ముడిచమురు ధరలు
Crude Oil Price Today 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.23 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 93.18 డాలర్లుగా ఉంది.

Last Updated :Sep 20, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.