ETV Bharat / business

వరుసగా రెండో సెషన్​లో లాభాలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​

author img

By

Published : Mar 29, 2022, 3:43 PM IST

Stock Market Close
Stock Market Close

Stock Market Close: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, హెవీవెయిట్​ షేర్ల ఊతంతో.. స్టాక్​ మార్కెట్లు మళ్లీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 350, నిఫ్టీ 103 పాయింట్ల మేర పెరిగాయి.

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 350 పాయింట్లు పెరిగి 57 వేల 944 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17 వేల 325 వద్ద సెషన్​ను ముగించింది. మంగళవారం సెషన్​లో సూచీలు మొత్తం లాభాల్లోనే కదలాడాయి. తొలుత సెన్సెక్స్​ దాదాపు 220 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకు లోనైనా సానుకూలంగానే ట్రేడయింది. ఓ దశలో దాదాపు 400 పాయింట్లకుపైగా పెరిగి 58,002 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. 57 వేల 639 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లో: ఫార్మా, రియాల్టీ రంగం సహా హెవీ వెయిట్​ షేర్ల ఊతంతో.. మార్కెట్లు లాభాల దిశగా పయనించాయి. వీటిల్లో కొనుగోళ్లు కనిపించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ సహా ఆయిల్​ అండ్​ గ్యాస్​ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం.. మదుపరుల సెంటిమెంట్​ను బలపర్చింది. ఐషర్​ మోటార్స్​, అదానీ పోర్ట్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, దివిస్​ ల్యాబ్స్​, భారతీ ఎయిర్​టెల్​ రాణించాయి. హీరో మోటోకార్ప్​, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఐఓసీ, ఐటీసీ నష్టపోయాయి. 1307 షేర్లు ముందుకు దూసుకెళ్లాయి. 1917 షేర్లు పడిపోయాయి. 89 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఇవీ చూడండి: మరింత తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

మరో దిగ్గజ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.