ETV Bharat / business

Small Saving Schemes Latest Interest Rates : ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. మరి PPF, సుకన్య సమృద్ధి పథకాల సంగతేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 8:02 AM IST

Small Saving Schemes Latest Interest Rates : 2023 అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏ పథకాలపై వడ్డీ రేట్లు పెంచింది? వేటిపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Small Saving Schemes Latest Interest Rates
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు

Small Saving Schemes Latest Interest Rates : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసింది ప్రభుత్వం. 5 ఏళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన సేవింగ్​ స్కీమ్స్​ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. 2023 అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రేట్లు వర్తింపు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నిరాశ కలిగిన పాపులర్ పథకాలపై వడ్డీ రేట్లు..
ప్రస్తుతం దేశంలో ప్రజల్లో మంచి ప్రజాదరణ ఉన్న పీపీఎఫ్​, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పాటు ఇతర పథకాల వడ్డీ రేట్లను కూడా ప్రభుత్వం మార్చకపోవడం నిరాశ కలిగించింది.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7%, సుకన్య సమృద్ధి యోజన 8%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2%, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. తాజా వడ్డీ రేట్లలో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌కు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. కనిష్ఠంగా సేవింగ్స్‌ డిపాజిట్‌కు 4.0 శాతం వడ్డీ అందనుంది.

బాలికల సంక్షేమం కోసం.. కేంద్రం అందిస్తున్న అద్భుతమైన స్కీమ్స్.!
Best Central Government Schemes for Girl Child : ఆడపిల్లల ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలను అందిస్తోంది. దాని ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇంతకీ ఆ పథకాలు ఏంటి? వాటికి ఎవరెవరు అర్హులనే విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

మగ పిల్లల కోసం.. పోస్టాఫీస్ 5 పొదుపు పథకాలు.. మీకు తెలుసా?
Best Post Office Child Saving Schemes in Telugu : పిలల్ల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే.. ప్రథమ కర్తవ్యంగా తల్లిదండ్రులు పనిచేస్తుంటారు. ఇలాంటి వారికోసమే.. పోస్టాఫీస్ 5 ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఇవి కేవలం మగ పిల్లలకు సంబంధించిన పథకాలు. మరి, ఆ పథకాలేంటి..? వాటితో కలిగే ప్రయోజనాలేంటి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

FD Vs NSC : ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్.. దేంట్లో రాబడి ఎక్కువ..?

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్​ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.