ETV Bharat / business

ఎస్​బీఐ కీలక నిర్ణయం ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

author img

By

Published : Aug 13, 2022, 8:14 PM IST

sbi fixed deposit
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

SBI FD Interest Rates స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 కోట్లలోపు ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 13న అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. మరోవైపు, సెంట్రల్ బ్యాంక్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచింది.

SBI FD Interest Rates దేశీయ అతిపెద్ద ప్ర‌భుత్వరంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. పెంచిన వ‌డ్డీ రేట్లు నేడు (2022 ఆగ‌ష్టు 13) అమ‌ల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ ప్ర‌స్తుతం 7 రోజుల నుంచి మొద‌లుకుని 10 ఏళ్లు వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల గ‌ల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 2.90 శాతం నుంచి 5.65 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేటును అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు మ‌రో 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.

ఎస్‌బీఐ తాజా వ‌డ్డీ రేట్లు..

  • 7 రోజుల నుంచి 45 రోజుల వ‌ర‌కు 2.90%
  • 46 రోజుల నుంచి 179 రోజుల వ‌ర‌కు 3.90%
  • 180 రోజుల నుంచి 210 రోజుల వ‌ర‌కు 4.55% (ఇంత‌కు ముందు ఇది 4.40 శాతంగా ఉండేది)
  • 211 రోజుల నుంచి ఏడాదిలోపు 4.60%
  • ఏడాది నుంచి రెండేళ్లలోపు 5.45% (ఇంత‌కు ముందు ఇది 5.30 శాతంగా ఉండేది)
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు 5.50% (ఇంత‌కు ముందు ఇది 5.35 శాతంగా ఉండేది)
  • మూడేళ్ల‌ నుంచి ఐదేళ్ల లోపు 5.60% (ఇంత‌కు ముందు ఇది 5.45 శాతంగా ఉండేది)
  • ఐదేళ్ల నుంచి ప‌దేళ్ల లోపు 5.65% (ఇంత‌కు ముందు ఇది 5.50 శాతంగా ఉండేది)

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా..
మరో ప్ర‌భుత్వ రంగ బ్యాంకు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెంచింది. ఈ కొత్త వ‌డ్డీ రేట్లు ఆగ‌ష్టు 10 నుంచి వ‌ర్తిస్తాయి. బ్యాంకు వివిధ కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను 2.75 శాతం నుంచి 5.60 శాతం వ‌డ్డీ రేటుతో అందిస్తుంది.

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌స్తుత ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు..

  • 7 రోజుల నుంచి 14 రోజులు గ‌ల డిపాజిట్ల‌పై 2.75%
  • 15 రోజుల నుంచి 30 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 2.90%
  • 31 రోజుల నుంచి 45 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 3.00%
  • 46 రోజుల నుంచి 90 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 3.35%
  • 91 రోజుల నుంచి 179 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 3.85%
  • 180 రోజుల నుంచి 364 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 4.50% ( ఇంత‌కు ముందు ఇది 4.40 శాతంగా ఉండేది.)
  • ఏడాది నుంచి రెండేళ్ల లోపు డిపాజిట్ల‌పై 5.35% (ఇంత‌కు ముందు ఇది 5.25 శాతంగా ఉండేది)
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్ల‌పై 5.40% (ఇంత‌కు ముందు ఇది 5.30 శాతంగా ఉండేది)
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్ల‌పై 5.40% (ఇంత‌కు ముందు ఇది 5.35 శాతంగా ఉండేది)
  • ఐదేళ్ల నుంచి 10 లోపు డిపాజిట్ల‌పై 5.60%
  • 555 రోజుల ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై బ్యాంక్ 5.55% వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తోంది.

ఇవీ చదవండి: వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి

రుణగ్రహీతలను వేధించొద్దు.. రికవరీ ఏజెంట్లపై కొరడా.. ఆర్​బీఐ కొత్త రూల్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.