ETV Bharat / business

SBI General Insurance New Health Policy : సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. అన్​లిమిటెడ్ రీఫిల్స్​.. 3X బెనిఫిట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 10:52 AM IST

SBI General Insurance Super Health Policy 2023
SBI General Insurance New Health Policy 2023

SBI General Insurance New Health Policy In Telugu : ఆరోగ్య బీమా తీసుకుందామని ఆలోచిస్తున్నవారికి గుడ్​ న్యూస్​. ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఓ సరికొత్త సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు అపరిమితైన సార్లు బీమా మొత్తాన్ని రీఫిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.

SBI General Insurance New Health Policy 2023 : ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్​ ఒక సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. పాలసీదారు ఒక వేళ బీమా మొత్తాన్ని క్లెయిమ్​ చేసినప్పటికీ.. దానిని మరలా 'రీఫిల్' చేసుకోవచ్చు. 'మల్టిప్లైయర్​' ఆప్షన్ ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు 3 రెట్లు బీమా కవరేజ్​ను కూడా పొందవచ్చు.

సూపర్ హెల్త్​ పాలసీ
SBI General Insurance Refill Policy : ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్​ లాంఛ్​ చేసిన ఈ సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. 27 ప్రామాణిక, 7 ఐచ్ఛిక బీమా కవరేజ్​లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్య బీమాలో నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయి. ఇవి రూ.3 లక్షల నుంచి రూ.2 కోట్ల రేంజ్​లో ఉంటాయి. వీటిని పాలసీదారులు 1 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధులతో (పాలసీ టెన్యూర్​) ఎంచుకోవచ్చు.

బెస్ట్ ఫీచర్స్​
SBI General Insurance Reinsurance Policy Features :

  • ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చిన ఈ ఫ్లాగ్​షిప్​ హెల్త్ ఇన్సూరెన్స్​లో అనేక న్యూ-ఏజ్ ఫీచర్లు ఉన్నాయి. వాక్​ హెల్తీ బినిఫిట్స్​, వెల్​నెస్​ కవరేజ్​ లాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
  • ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ ఆరోగ్య బీమా పాలసీ కోసం ఒక ప్రత్యేకమైన యాప్​ను రూపొందించింది. దీనిలోని లక్ష్యాలను పాలసీదారులు పూర్తి చేస్తే, రెన్యువల్ చేసేటప్పుడు.. మీరు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్​ కూడా 30 శాతం తగ్గుతుంది

నో లిమిట్స్​!
SBI General insurance Reinsurance Policy Limits : ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చిన ఈ ఆరోగ్య బీమా పథకంలో 'రీఇన్సూర్​ బెసిఫిట్' ఉంది. అంటే పాలసీదారుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసిన తరువాత కూడా, దానిని మరలా రీఫిల్ చేసుకోవచ్చు. ఇలా అపరిమితమైన సార్లు ఈ పాలసీ ప్రయోజనాలు పొందవచ్చు.

మూడు రెట్లు ప్రయోజనం!
SBI General Insurance Reinsurance Policy Benefits :

  • రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి ఈ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే.. 3 రెట్లు వరకు ప్రయోజనం లభిస్తుంది.
  • రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల బీమా కవరేజీ తీసుకుంటే.. 2 రెట్లు వరకు ప్రయోజనం అందుతుంది.
  • ఈ ఆరోగ్య బీమా పాలసీదారులకు సంచిత బోనస్​ (ECB) లభిస్తుంది. అంటే పాలసీదారు ఒక సంవత్సరంలో ఎలాంటి బీమా క్లెయిమ్​ చేయకపోతే.. తరువాతి సంవత్సరం బేస్ సమ్ అష్యూర్డ్​పై 50 శాతం బోనస్ లభిస్తుంది.
  • ఈ ఆరోగ్య బీమా పాలసీదార్లకు 'క్లెయిమ్స్​​ షీల్డ్ బెనిఫిట్స్​​' ఉంటాయి. దీని వల్ల ఆసుపత్రిలో జరిగే వైద్యేతర ఖర్చులను కూడా బీమా సంస్థ చెల్లిస్తుంది.

ప్రజల ప్రత్యేకమైన ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు.. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్​ ప్లాన్​లను ప్రారంభించినట్లు ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్​ పేర్కొంది. ఇన్​-హౌస్​ మోడల్ ఆధారంగా​ క్లెయిమ్​లను సెటిల్ చేస్తామని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.