ETV Bharat / business

మార్కెట్​లోకి రిటైల్‌ డిజిటల్‌ రూపాయి.. డిసెంబర్​ 1 నుంచి RBI ప్రయోగాత్మక ప్రాజెక్ట్​

author img

By

Published : Nov 30, 2022, 6:50 AM IST

rbi digital rupee pilot
రిటైల్‌ డిజిటల్‌ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టు

మార్కెట్​లోకి రిటైల్‌ డిజిటల్‌ రూపాయి ప్రవేశపెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.

రిటైల్‌ డిజిటల్‌ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. డిజిటల్‌ రూపాయిని టోకు విభాగంలో నవంబరు 1న ఆర్‌బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ లేదా డిజిటల్‌ రూపాయి అనేది డిజిటల్‌ రూపంలో ఆర్‌బీఐ జారీ చేసే అధీకృ కరెన్సీ. వీటిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. "రిటైల్‌ డిజిటల్‌ రూపాయి అనేది డిజిటల్‌ టోకెన్‌ రూపంలో ఉంటుంది. చట్టబద్ధంగా ఇది చెల్లుతుంది. ప్రస్తుతం జారీ అవుతున్న పేపరు కరెన్సీ, నాణేల విలువలలోనే ఇది కూడా జారీ అవుతుంద"ని ఆర్‌బీఐ పేర్కొంది.

  • టోకు డిజిటల్‌ రూపాయి తరహాలోనే రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వినియోగదార్లు, వ్యాపారులతో కూడిన బృందాలకు మాత్రమే అందుబాటులోకి తెస్తారు.
  • బ్యాంకుల ద్వారా జారీ అయ్యే డిజిటల్‌ రూపాయిని.. బ్యాంకులు అందించే డిజిటల్‌ వాలెట్‌ రూపంలో మొబైల్‌ ఫోన్లు/ఇతర పరికరాల్లో దాచుకోవచ్చు.
  • వీటి సాయంతో వ్యక్తి నుంచి వ్యక్తికి; వ్యక్తి నుంచి వ్యాపారులకు లావాదేవీలు జరపొచ్చు. మర్చంట్ల వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించి వారికి చెల్లింపులు చేయవచ్చు.
  • భౌతిక నగదు తరహాలోనే రిటైల్‌ డిజిటల్‌ రూపాయి సైతం భద్రత, సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. ఈ రూపంలో నగదు మన వాలెట్లలో ఉంటే వడ్డీ లభించదు. కేవలం బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంచితేనే వడ్డీ లభిస్తుంది.
  • ప్రాథమికంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌.. నగరాల్లో ఈ ప్రయోగాత్మక లావాదేవీలు అమలవుతాయి. తదుపరి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, సిమ్లా, ఇండోర్‌, కోచి, గాంగ్‌టక్‌, లఖ్‌నవూ, గువహటి వంటి 9 నగరాలకు విస్తరిస్తారు.
  • క్రమంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లకు; ఇతర వినియోగదార్లు, ప్రాంతాలకు కూడా డిజిటల్‌ రూపీ సేవలను విస్తరిస్తారు.* ఇRs-ఆర్‌ టోకెన్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు, ఉపయోగాలను భవిష్యత్తు ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో పరీక్షిస్తారు.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కేంద్ర బ్యాంకులు సీబీడీసీలపై ఆసక్తి వ్యక్తం చేశాయి. కొన్ని ఇప్పటికే రిటైల్‌, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెడితే.. చాలా వరకు పరిశోధన, పరీక్షలు, సొంత సీబీడీసీ వ్యవస్థలపై పనిచేస్తున్నాయి.
  • ఇవీ చదవండి:
  • ఎయిర్​ ఇండియాలో విస్తారా ఎయిర్​లైన్స్​ విలీనం
  • భారత్​లో అత్యంత సంపన్నుడిగా అదానీ.. టాప్‌-100లో 30% సంపద వరిద్దరి వద్దే!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.