ETV Bharat / business

బ్యాంకుల్లో పట్టించుకోని సొమ్ము రూ.35వేల కోట్లు.. అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్​ చేసుకోండిలా!

author img

By

Published : May 14, 2023, 10:04 AM IST

Unclaimed deposits
Unclaimed deposits

Unclaimed Deposits In Banks : పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్​ల ద్వారా బ్యాంకుల్లో డబ్బులు దాచి.. దాన్ని మరచిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకనే ఇప్పుడు దేశంలోనే బ్యాంకులన్నీ ఆ మొత్తం సొమ్మును కలిపి రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి. మరి ఈ మొత్తంలో మీ డబ్బూ ఉందా? అలా ఉంటే దాన్ని తీసుకునేందుకు ఏం చేయాలి. ఓ సారి తెలుసుకుందాం.

Unclaimed Deposits In Banks : బ్యాంక్​కు సంబంధించిన పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్​లలో డబ్బులు దాచి మరచిపోయిన వారెందరో. అయితే ఇలా వివిధ బ్యాంక్​లలో మర్చిపోయిన సొమ్ము మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల మేర ఉందని ఆర్‌బీఐ లెక్క తేల్చి చెప్పింది. సుమారు పదేళ్లకు పైగా ఎటువంటి లావాదేవీలను నిర్వహించని ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బు ఇది. అయితే ఈ డబ్బును ఇప్పుడు బ్యాంకులన్నీ కలిపి రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి. మరి ఈ మొత్తంలో మీ డబ్బూ ఉందా? అలా ఉంటే దాన్ని తీసుకునేందుకు ఏం చేయాలి. ఓ సారి తెలుసుకుందాం.

క్లెయిమ్​ చేయని మొత్తం సొమ్మును సంబంధిత వ్యక్తులకు అందించాలనే సంకల్పంలో ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా ప్రత్యేకంగా దీని కోసం గైడ్​లైన్స్​ను సిద్ధం చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి సూచనలు జారీ చేశారు. బ్యాంకింగ్‌ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు.. ఇలా పెట్టుబడులు పెట్టిన ప్రతి పథకంలోనూ క్లెయిం చేయకుండా ఉన్న మొత్తం చాలానే ఉంది. అయితే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్న తరుణంలో బ్యాంకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకుల్లో ఎవరి డబ్బైనా ఉందా లేదా అన్న విషయాన్ని ఖాతాదారులు తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. పలు బ్యాంకులు ఇప్పటికే 'అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌'లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. బ్యాంకు వెబ్‌సైటులో ఇందుకోసం ప్రత్యేక లింక్‌ను సైతం ఖాతాదారుల కోసం అందుబాటులోకి ఉంచుతున్నాయి. దానికి ఉపయోగించుకోవాలంటే ఈ కింది సూచలనలను పరిగణలోకి తీసుకోవాలి..

  • మీకు డిపాజిట్‌ లేదా పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు అధీకృత వెబ్‌సైటుకు వెళ్లి, అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల లింక్‌పై క్లిక్‌ చేయండి. సెర్చ్‌ ఇంజిన్‌లోనూ దీన్ని వెతికి పట్టుకోవచ్చు.
  • కొన్ని బ్యాంకులు పేరు, పుట్టిన తేదీ వివరాలతో క్లెయిం చేసుకోని ఖాతాదారుల వివరాలను తెలియజేస్తున్నాయి.
  • మరికొన్ని అదనంగా పాన్‌ లేదా ఇతర గుర్తింపు వివరాలను ఖాతాదారులను కోరుతున్నాయి. అప్పుడు పేరు, చిరునామా వివరాలు కనిపిస్తాయి. అవి మీవే అని అనిపిస్తే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. తద్వారా తదుపరి ప్రక్రియను తెలుసుకోవచ్చు.
  • సొంతంగా క్లెయిం చేసుకోవాలని అనుకునే వారు.. తమకు కావాల్సిన సమచారం కోసం ఒక దరఖాస్తు పత్రంతోపాటు, గుర్తింపు ధ్రువీకరణలను జత చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆ ఖాతాను ఆపరేటివ్‌గా మార్చి ఖాతాదారులకు అందిస్తారు.
  • ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే.. నామినీ లేదా వారి వారసులు ఆయా బ్యాంకును సంప్రదించి.. బ్యాంకు అధికారులు అడిగిన వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ముగిశాక.. అప్పుడు నిబంధనల మేరకు బ్యాంకు.. ఆ డబ్బును నామినీ లేదా వారసుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.