ETV Bharat / business

51 శాతం తగ్గిన బ్యాంకు మోసాలు.. కానీ అందులో మాత్రం..

author img

By

Published : May 15, 2022, 10:27 PM IST

Bank Frauds in India: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు మోసాలు తగ్గుముఖం పట్టినట్లు ఆర్​బీఐ తెలిపింది. నగదుపరంగా ప్రభుత్వ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గాయని వెల్లడించింది. అయితే, సంఖ్యాపరంగా తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది.

BANK FRAUDS
BANK FRAUDS

Bank Frauds in India: నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గి రూ.40,295.25 కోట్లకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. 2021-22లో 12 పీఎస్‌బీల్లో కలిపి రూ.40,295.25 కోట్లు మోసానికి గురైనట్లు వెల్లడించింది. చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సామాజిక కార్యకర్త 'సమాచార హక్కు చట్టం' కింద కోరిన సమాచారం మేరకు ఆర్‌బీఐ ఈ వివరాలను అందించింది.

Bank frauds RBI report: అయితే, సంఖ్యాపరంగా చూస్తే తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని ఆర్‌బీఐ అందించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2020-21లో 9,933 బ్యాంకు మోసం కేసులు నమోదుకాగా.. 2021-22లో ఆ సంఖ్య 7,940కి పడిపోయాయి. అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అన్ని విభాగాల్లో కలిపి 431 కేసుల్లో రూ.9,528.95 కోట్ల సొమ్ము మోసానికి గురైంది. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో 4,192 బ్యాంకు మోసాల్లో ఖాతాదారులు రూ.6,932.37 కోట్లు నష్టపోయారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.