ETV Bharat / business

పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 4:27 PM IST

Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates : పోస్టాఫీస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి.. చిన్న మొత్తాల పొదుపు పథకాలే! మరి.. తపాలా శాఖలో ఎన్ని సేవింగ్ స్కీమ్స్‌ ఉన్నాయో మీకు తెలుసా? వడ్డీ రేట్ల నుంచి పన్ను ప్రయోజనాల దాకా.. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Post Office Saving Schemes 2023 Benefits
Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates

Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates: భవిష్యత్తుకోసం పొదుపు చేయాలనే ఆలోచన ఇప్పుడు అందరిలోనూ విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగానే.. పోస్టల్ శాఖ కూడా అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలకూ సరిపోయే విధంగా.. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తోంది. ప్రస్తుతం సేవింగ్ స్కీమ్స్​ చాలానే ఉన్నాయి. ఆ పొదుపు పథకాల ఫీచర్స్, ట్యాక్స్, కాలవ్యవధి ఒక్కో దానికి ఒక్కోలా ఉన్నాయి. చాలా పథకాలకు.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c వర్తిస్తుంది. దీని ప్రకారం రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికంలోనూ సవరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. అసలు పోస్టాఫీసులో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి..? వాటి వడ్డి రేట్లు ఎలా ఉన్నాయి..? ఎంత మొత్తం డిపాజిట్ చేయాలి..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Saving Scheme : పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్​.. ఎలాంటి రిస్కు లేకుండా డబ్బులు డబుల్..!

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account) :

  • ఈ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాను ఒక్కరిగా లేదా ఇద్దరు కలిసి ఉమ్మడిగా తెరిచేందుకు వీలుంటుంది.
  • పదేళ్లు పైబడిన మైనర్ తరపున, మానసిక స్థితి సరిగాలేని వ్యక్తి తరఫున గార్డియన్‌ తరపున ఈ అకౌంట్ తెరవొచ్చు.
  • ఈ ఖాతా ఓపెన్​ చేయడానికి కనీసం రూ.500 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఇందులో వడ్డీ రేటు ఏడాదికి 4 శాతంగా ఉంది.
  • మీ అభ్యర్థనపై చెక్ బుక్, ATM కార్డ్, ఇ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఇతర సేవలను అందిస్తారు.
  • ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ జమ అవుతుంది.

Bal Jeevan Bima Yojana Scheme: చిన్నారులకు 'బీమా'.. రోజుకు రూ.6 ఇన్వెస్ట్​ చేస్తే.. రూ. లక్ష ఇన్సూరెన్స్‌..!

రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit Account (RD)) :

  • ఐదేళ్ల పోస్టాఫీస్ RD కింద ఎన్ని అకౌంట్లనైనా తెరిచేందుకు ఛాన్స్ ఉంటుంది.
  • ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది.
  • ఇందులో కనీస డిపాజిట్ రూ.100 కాగా.. గరిష్టంగా ఎంతవరకైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
  • వడ్డీ త్రైమాసికానికి కలిపి ఉంటుంది.

నేషనల్​ సేవింగ్స్​ టైమ్​ డిపాజిట్ (National Savings Time Deposit (TD)) :

  • ఇందులో పెట్టుబడిదారులు.. 1,2,3,5 సంవత్సరాలపాటు పోస్టాఫీస్ టైం డిపాజిట్ అకౌంట్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
  • కనీసం రూ.1000 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.
  • టైం డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత అదనంగా సంవత్సరం పాటు కొనసాగించొచ్చు.
  • వార్షికంగా.. పోస్టాఫీస్ వడ్డీని జమ చేస్తుంది.
  • ఐదేళ్ల టైం డిపాజిట్‌కు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇందులో ఏడాది టైం డిపాజిట్‌కు 6.90 % వడ్డీ, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.
  • పోస్ట్ ఆఫీస్ TD ఖాతాను.. షెడ్యూల్డ్ లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో సెక్యూరిటీగా కూడా తాకట్టు పెట్టవచ్చు.
  • ఈ డిపాజిట్లను మధ్యలో ఉపసంహరించుకోలేరు. కావాలంటే.. గడువు ముగియడానికి మరో 5 నెలలు కాలం ఉందనగా తీసుకోవచ్చు.

Post Office Monthly Income Scheme Details : ఒక్కసారి ఈ పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడితో.. నెలనెలా చేతికి డబ్బులు!

పోస్టాఫీసు మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​ (Monthly Income Scheme (MIS)) :

  • మంత్లీ ఇన్‌కమ్​ స్కీమ్‌లో చేరితే.. నెలనెలా వడ్డీ పొందొచ్చు. ఆదాయపు పన్ను శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
  • ఈ పథకంలో వడ్డీ రేటు ఏడాదికి 7.40 శాతంగా ఉంటుంది.
  • కనీస డిపాజిట్ ఇందులో రూ.1000గా ఉంది.
  • గరిష్ట డిపాజిట్ విషయానికి వస్తే.. సింగిల్ అకౌంట్‌లో రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షల వరకు పరిమితి ఉంది.
  • ఈ స్కీమ్​ మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు.
  • డిపాజిట్ చేసిన తర్వాత కనీసం ఒక సంవత్సరం పూర్తి కాకుండా ఖాతాను మూసివేయలేరు. అయినా మూసివేయాల్సి వస్తే.. జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Post Office Vs SBI Vs HDFC Interest Rates : పోస్టాఫీస్/ఎస్​బీఐ/హెచ్​డీఎఫ్​సీ.. రికరింగ్ డిపాజిట్​కు ఏది బెటర్..?

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌ (Senior Citizens Savings Scheme (SCSS)) :

  • సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో.. 60 సంవత్సరాలు పైబడిన వారు పెట్టుబడి పెట్టొచ్చు.
  • కనీస డిపాజిట్ 1000 రూపాయలు కాగా.. గరిష్ఠ డిపాజిట్ రూ.30 లక్షలుగా ఉంది.
  • ఇందులో 3 నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు.
  • ఆ వడ్డీని ఇదే స్కీమ్​కు ఆటో క్రెడిట్​గా కూడా మళ్లించుకోవచ్చు.
  • ఇందులో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ లభిస్తుంది.
  • 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు మాత్రమే ఈ ఖాతా తెరవడానికి అర్హులు.
  • ఖాతాను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి మాత్రమే ఓపెన్​ చేయగలరు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (Public Provident Fund(PPF)):

  • ఒకరికి ఒక పీపీఎఫ్ అకౌంట్ తెరిచేందుకు మాత్రమే అర్హత ఉంటుంది.
  • దీనిని పోస్టాఫీస్‌లో లేదా బ్యాంకులో తెరవొచ్చు.
  • అసలు, వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయానికి మాత్రమే చెల్లిస్తారు.
  • ఇక వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను అనేది ఉండదు. ఇందులో 7.10 శాతంగా వడ్డీ ఉంది.
  • రూ.500 వరకు కచ్చితంగా డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకునేందుకు వీలుంటుంది.
  • ఇక్కడ డిపాజిట్ కాలవ్యవధి 15 సంవత్సరాలు.
  • 15 ఏళ్లు పూర్తయ్యాక.. ప్రతి 5 సంవత్సరాలకు డిపాజిట్ టెన్యూర్‌ను పొడిగించుకోవచ్చు.

Small Saving Schemes Revised Interest Rates 2023 : పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? వడ్డీరేట్లు చూసుకున్నారా..?

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం (National Saving Certificate (NSC)) :

  • నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం కింద ఎన్ని అకౌంట్లు అయినా తెరవొచ్చు.
  • వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు.
  • 18 ఏళ్లు నిండినవారు ఈ అకౌంట్ తెరవొచ్చు.
  • మైనర్ అయితే.. పదేళ్లు దాటిన వారి పేరు మీద సంరక్షకుడు అకౌంట్ తెరిచేందుకు ఛాన్స్ ఉంటుంది.
  • ఇందులో వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంది.
  • కనీసం రూ.1000 వరకు డిపాజిట్ చేయాలి. గరిష్ట డిపాజిట్‌పై ఎలాంటి పరిమితి లేదు.
  • డిపాజిట్ కాలవ్యవధి 5 సంవత్సరాలు.

కిసాన్​ వికాస్​ పత్ర పథకం (Kisan Vikas Patra (KVP)) :

  • కిసాన్ వికాస్ పత్ర స్కీం కింద కూడా ఎన్ని అకౌంట్లనైనా తెరిచేందుకు వీలుంటుంది.
  • పెట్టుబడి మొత్తం 10 సంవత్సరాలు అంటే 120 నెలల్లో రెట్టింపు అవుతుంది.
  • 18 సంవత్సరాలు నిండినవారు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
  • ఇందులో 7.50 శాతంగా వడ్డీ అమల్లో ఉండగా.. కనీసం రూ.1000 వరకు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు.
  • KVPని షెడ్యూల్డ్ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు సెక్యూరిటీగా తాకట్టు పెట్టవచ్చు.

SBI RD Vs Post Office RD.. రెండింట్లో ఏది బెటర్​ ఆప్షన్​?

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Account) :

  • సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన పథకం.
  • ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల కోసం ఈ అకౌంట్ తెరవొచ్చు.
  • 2వ కాన్పులో కవలలు (అమ్మాయిలు) పుడితే మాత్రం ముగ్గురు అమ్మాయిల తరఫున అకౌంట్లు తెరవొచ్చు.
  • పాప వయసు పదేళ్లు దాటకముందే ఈ అకౌంట్ తెరవాలి. అంటే.. తండ్రి గానీ, గార్డియన్ గానీ ఈ అకౌంట్ తెరిచేందుకు ఛాన్స్ ఉంటుంది.
  • ఇందులో వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. చెల్లించడం మాత్రం మెచ్యూరిటీతోనే అసలు, వడ్డీ కలిపి ఇస్తారు.
  • మెచ్యూరిటీపై ఎలాంటి ఆదాయపు పన్నూ ఉండదు.
  • ఈ స్కీమ్​లో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు ఉంది.
  • ఇందులో ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.
  • మీరు ఖాతా తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Best Post Office Saving Schemes for Boy Child : మగ పిల్లల కోసం.. పోస్టాఫీస్ 5 పొదుపు పథకాలు.. మీకు తెలుసా?

National Savings Certificate Vs Public Provident Fund : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ Vs పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ఏది బెస్ట్..?

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.