ETV Bharat / business

కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్- పెట్రోల్​, డీజిల్​పై రూ.10 తగ్గింపు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 12:18 PM IST

Updated : Dec 29, 2023, 1:23 PM IST

Petrol Diesel Price News
Petrol Diesel Price News

Petrol Diesel Price News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించనున్నట్లు సమాచారం. లీటర్​పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశముందని తెలుస్తోంది.

Petrol Diesel Price News : 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటర్​పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాన్యులపై భారం తగ్గించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీ- ఓఎమ్​సీలతో కేంద్రం ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఓఎమ్​సీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం.

గత మూడు నెలలుగా బ్యారెల్ చమురు ధర 70-80 డాలర్ల శ్రేణిలో ఉంది. గత 20 నెలలుగా రిటైల్​ ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించలేదు. ఈ నేపథ్యంలో ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలుస్తోంది. 2024లో ప్రారంభంలో పెట్రోల్​ డీజిల్ ధరలను సవరించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇంధన ధరల తగ్గింపుపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ ఇటీవల చర్చలు జరిపాయని, దీనికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయానికి రెండు ఆప్షన్లు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. నవంబర్​ నెలలో రిటైల్​ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి 5.55 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు తగ్గిస్తే రిటైల్​ ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్, 2022 మేలో రెండు విడతలుగా పెట్రోల్​ డీజిల్​పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మొత్తంగా పెట్రోల్​పై లీటరుకు రూ.13, డీజిల్‌పై లీటరుకు రూ. 16 చొప్పున తగ్గించింది. ఫలితంగా రిటైల్​ ధరలు కూడా తగ్గడం వల్ల వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది.
మరోవైపు ముడి చమురు ధరలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఈ ఏడాది మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్- BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్- HPCL) మంచి లాభాలు ఆర్జించాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ మూడు కంపెనీలు కలిసి రూ.58,198 కోట్ల లాభాలు నమోదు చేశాయి.

చమురు ధరలకు రెక్కలు.. భారత్​లో మాత్రం నో ఛేంజ్​.. ఎన్నికలయ్యాక వాత!

'పెట్రోల్​, డీజిల్​ ధరలు ఎందుకు పెంచట్లేదు.. వేల కోట్లు నష్టపోతున్నాం!'

Last Updated :Dec 29, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.