ETV Bharat / business

ITR Filing Compulsory : ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్నులు తప్పనిసరా?

author img

By

Published : Jun 2, 2023, 6:56 PM IST

ITR Filing Compulsory
ITR Filing Compulsory

ITR Filing Compulsory : ఆదాయపు పన్ను రిటర్నులుపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. నేను ఐటీ రిటర్నులు దాఖలు చేయాలా? మినహాయింపులు ఎంత? ఇలాంటి అనేక ప్రశ్నలు మనసులో చెలరేగుతాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలివే.

ITR Filing Compulsory : నేను ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాలా? ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తానా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఏమిటి? ఓ సారి తెలుసుకుందాం మరి.

అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు వ్యక్తులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. జీతం, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ, డివిడెండ్‌, అద్దె ద్వారా ఆదాయంలాంటి వాటిని ఒక చోట చేర్చాలి. 26 ఏఎస్‌ లేదా ఏఐఎస్‌ను గమనిస్తే వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయాలు తెలుస్తాయి. వివిధ సెక్షన్ల కింద అంటే సెక్షన్‌ 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ, 80టీటీఏ తదితరాలకు ముందున్న ఆదాయం ఎంతో చూడాలి.

  • 60 ఏళ్ల లోపు వారికి ప్రాథమిక మినహాయింపు రూ.2.50 లక్షలు. 60-80 ఏళ్ల వారికి రూ.3 లక్షలు. 80 ఏళ్లపైన ఉన్న వారికి రూ.5లక్షల వరకూ పన్ను వర్తించదు. పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను, పన్ను వర్తించే ఆదాయం ఈ పరిమితి లోపే ఉంటుంది. రూ.5 లక్షల లోపు పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడు సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేటు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, వర్తించే ఐటీఆర్‌ ఫారంలో రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.
  • విదేశాల్లో ఉన్న ఆస్తి నుంచి లాభాలు ఆర్జించినప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోయినా ఆదాయపు పన్ను రిటర్నులు తప్పవు. దేశం వెలుపల నిర్వహించిన ఏదైనా ఆర్థిక లావాదేవీలో మీరు భాగం పంచుకున్నప్పుడు, బ్యాంకు ఖాతాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
  • విదేశీ కంపెనీల షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లలో మదుపు చేసిన వారూ ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
  • అన్ని కరెంటు ఖాతాల్లో రూ.కోటి, అన్ని పొదుపు ఖాతాల్లో రూ.50 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసినప్పుడు కచ్చితంగా ఐటీఆర్​ దాఖలు చేయాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం నుంచి మినహాయించిన పన్ను మొత్తం రూ.25వేలు దాటితే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి.
  • విదేశీ ప్రయాణాల కోసం రూ.2లక్షలకు మించి ఖర్చు చేసినప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరి. పన్ను చెల్లింపుదారుడు, అతని/ఆమె కుటుంబ సభ్యులు చేసిన విదేశీ ప్రయాణాలనూ ఐటీఆర్​లో చూపించాల్సి ఉంటుంది.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి విద్యుత్‌ బిల్లు చెల్లించిన సందర్భంలో ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాలి.

ఐటీ రిటర్నులు దాఖలు సమయంలో జాగ్రత సుమా!
చాలామంది తాము ఆదాయపు పన్ను రిటర్నులు సరిగ్గానే పూర్తి చేశామనే భావనలో ఉంటారు. ఐటీ విభాగం నుంచి నోటీసు రావడం లేదా రిఫండు ఆలస్యమైనప్పుడే పొరపాటు దొర్లినట్లు గుర్తిస్తారు. ఆదాయపు పన్ను సెక్షన్ల గురించి సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మరెందుకు రిటర్నులు దాఖలు చేసినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.