ETV Bharat / business

రైల్వే 'సూపర్‌' యాప్‌ - అన్ని సేవలు ఒకే చోట - ఇకపై టికెట్​ బుకింగ్​కు నో వర్రీస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 3:27 PM IST

train ticket booking app
Indian Railway Super App

Indian Railway Super App Details In Telugu : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్​. ఇండియన్ రైల్వే త్వరలో సూపర్ యాప్​ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్​ బుకింగ్, ఫుడ్ డెలివరీ, పీఎన్​ఆర్​ స్టేటస్​, ట్రైన్​ రన్నింగ్ స్టేటస్​ సహా, అన్ని రకాల రైల్వే సేవలు ఓకే చోట లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Railway Super App : ట్రైన్ టికెట్ బుకింగ్, ట్రాకింగ్, ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ఇండియన్​ రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఓ సూపర్‌ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది.

రైల్వే సూపర్​ యాప్​
ప్రస్తుతం రైలు టికెట్‌ బుకింగ్‌ కోసం ఒక యాప్‌, ఫిర్యాదుల కోసం ఒక యాప్‌, జనరల్‌ టికెట్లు తీసుకోవడానికి ఇంకో యాప్‌ ఉన్నాయి. ఇవి కాకుండా పీఎన్​ఆర్​ స్టేటస్​, ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌లను తెలుసుకోవడానికి మరికొన్ని యాప్​లు ఉన్నాయి. దీని వల్ల రైలు ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఈ రైల్వే సేవలు అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే (Indian Railways) సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఓ సూపర్​ యాప్​ను రూపొందిస్తోంది.

ఒక్క యాప్ కోసం రూ.90 కోట్లు ఖర్చు
ఇండియన్​ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం ఈ సూపర్​ యాప్‌ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.90 కోట్లు వరకు వెచ్చించనున్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) ఈ సూపర్​ యాప్​ను డెవలప్ చేస్తున్నట్లు ​తెలిసింది.

'ఈ సూపర్ యాప్​ కనుక అందుబాటులోకి వస్తే, రైలు ప్రయాణికులకు ఇప్పుడు ఉన్న వివిధ ట్రైన్ సర్వీస్​ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా రైల్వేకు చెందిన అన్ని సర్వీసులు ఒకే చోట లభిస్తాయి. వాస్తవానికి యూజర్ల ఫీడ్​బ్యాక్ ఆధారంగా ఈ యాప్​ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది' అని రైల్వే వర్గాలు తెలిపాయి.

అన్ని సేవలు ఒకే చోట
ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం 'రైల్‌ కనెక్ట్‌' యాప్‌ అందుబాటులో ఉంది. లక్షలాది మంది ఈ యాప్​ను డౌన్‌లోడ్​ చేసుకున్నారు. ఇది కాకుండా యూటీఎస్‌, రైల్‌ మదద్ యాప్​లను కూడా వేలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే సూపర్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత, వీటితో పని ఉండదు. అంతేకాదు, ఐఆర్‌సీటీసీ అందించే ఫ్లైట్​ టికెట్‌ బుకింగ్​, ఫుడ్‌ డెలివరీ లాంటి సేవలు కూడా ఇందులోనే లభించనున్నాయి. అయితే ఈ సూపర్ యాప్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు.

బ్యాంక్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ - మినిమం బ్యాలెన్స్ లేకపోయినా నో పెనాల్టీ!

755 రూపాయలకే రూ.15 లక్షల ప్రమాద బీమా! పిల్లల చదువులకు అదనంగా మరో రూ.1లక్ష కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.