ETV Bharat / business

భారత్​లో హయ్యెస్ట్ టాక్స్ పేయర్​ ఎవరు?.. తెలిస్తే షాక్ అవుతారు!

author img

By

Published : Aug 1, 2023, 8:08 AM IST

Highest Tax Payer In India Individual : ఐటీఆర్ దాఖలు గడువు జులై 31తో ముగిసింది. ఇప్పుడు అందరిలో తలెత్తే మొదటి ప్రశ్న.. మన దేశంలో అత్యధిక ఆదాయపన్ను చెల్లించింది ఎవరు? అపర కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్​ ఆదానీ, రతన్​ టాటా అనుకునేరు.. కానీ వాళ్లు టాప్​ టాక్స్ పేయర్స్​ లిస్ట్​లో లేరు. ఒక బాలీవుడ్​ స్టార్​ హీరో హయ్యెస్ట్ టాక్స్ పేయర్​గా ఉన్నారు. అతను ఎవరో మీరు ఊహించగలరా?

highest-individual-taxpayers-in-india-bollywood-star-akshay-kumar
భారత్​లో హయ్యెస్ట్ టాక్స్ పేయర్​

Highest Individual Tax payer In India : 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు చేసే ఆఖరి గడువు ముగిసిపోయింది. ఇప్పుడు అందరి మదిని తొలిచే ప్రశ్న ఏమిటంటే.. భారతదేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించింది ఎవరు? అని. చాలా మంది అపర కుబేరులు ముకేశ్​ అంబానీ, గౌతమ్ ఆదానీ, రతన్​ టాటా అని అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదు.

స్టార్​ టాక్స్ పేయర్..
Highest Tax Payer In India Person : భారతదేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించినది మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​. అవును మీరు చదువుతున్నది నిజమే. అధికారిక సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అక్షయ్​ కుమార్​ రూ.29.5 కోట్లు మేర ఆదాయపన్ను చెల్లించారు. ఈ టాప్​ హీరో తన వార్షిక ఆదాయం రూ.486 కోట్లు అని ఐటీఆర్​లో పేర్కొనడం గమనార్హం.

బాలీవుడ్​ కిలాడీ..
Bollywood Star Akshay Kumar : బాలీవుడ్​ అని పిలుచుకునే హిందీ సినిమా ఇండస్ట్రీలో అక్షయ్​ కుమార్​ ఒక టాప్​ స్టార్​. అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. ప్రతి సంవత్సరం కనీసం 4-5 సినిమాలు చేస్తుంటారు అక్షయ్​ కుమార్​. అందువల్ల ఆయనకు మంచి ఆదాయమే వస్తుంది.

ప్రొడక్షన్​ హౌస్​ కూడా..
Akshay Kumar Production House : అక్షయ్​ కుమార్​కు స్వయంగా ఒక ప్రొడక్షన్​ హౌస్​ ఉంది. అలాగే అతను అనేక స్పోర్ట్స్​ టీమ్​లను కూడా కలిగి ఉన్నారు. వీటితో పాటు ఆయన ప్రకటనల్లో నటించడానికి, వివిధ బ్రాండులను ప్రమోట్ చేయడానికి కూడా భారీ ఎత్తున పారితోషకం తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఆయన ఆదాయం భారీగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షయ్​ కుమార్​ 2020-21లోనూ భారతదేశంలోనే అత్యధికంగా రూ.25.5 కోట్ల మేర ఆదాయపన్ను చెల్లించారు.

అపర కుబేరులు ఎక్కడ?
ఇక్కడ అందరికీ వచ్చే ఒక అనుమానం ఏమిటంటే.. ఒక సినిమా హీరో భారతదేశంలో టాప్​ టాక్స్ పేయర్​గా ఉన్నాడు. కానీ లక్షలాది, వేలాది కోట్లు ఉన్న ముఖేశ్ అంబానీ, గౌతమ్ ఆదానీ, రతన్ టాటా ఆ టాప్ టాక్స్ పేయర్స్​​ లిస్ట్​లో లేరు. కారణం ఏమిటి?

వాస్తవానికి మనం అపరకుబేరులు అనుకుంటున్న వ్యాపారవేత్తల పేరు మీద ఆస్తులు ఉండవు. వారు నడిపిస్తున్న కంపెనీల పేరు మీద ఆస్తులు ఉంటాయి. కనుక వాళ్లు కంపెనీ తరపున మాత్రమే కార్పొరేట్ ఇన్​కం టాక్స్ కడుతుంటారు. అందుకే వ్యక్తిగత టాక్స్​ పేయర్స్ లిస్ట్​లో వారి పేర్లు ఉండవు.
ఐటీఆర్​ ఫైలింగ్ గడువు ముగిసింది!

ఈ ఆర్థిక సంవత్సరం ఐటీఆర్​ దాఖలు చేసే గడువు సోమవారంతో (జులై 31)తో ముగిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దాదాపు 6 కోట్లకు మించి ఐటీఆర్​లు దాఖలు అయ్యాయని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. కేవలం ఆదివారం ఒక్క రోజే దాదాపు 27 లక్షల ఐటీఆర్​లు ఫైల్​ అయ్యాయని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.