ETV Bharat / business

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

author img

By

Published : Aug 10, 2023, 8:24 AM IST

Govt Bank FD Interest Rates 2023 : మీరు స్థిరమైన ఆదాయం కోసం పొదుపు చేద్దామని అనుకుంటున్నారా? ఎలాంటి రిస్క్​ తీసుకోవడం మీకు ఇష్టం లేదా? అయితే మీకు ఫిక్స్​డ్​ డిపాజిట్స్ మంచి ఆప్షన్​ అవుతుంది? ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మరి ఏయే బ్యాంకుల్లో.. ఎంత మేరకు ఆ వడ్డీ రేట్లు ఉన్నాయో ఓసారి చూద్దామా?

Bank Fixed Deposit Interest Rates 2023
Latest Govt Bank FD Interest Rates 2023

Govt Bank FD Interest Rates 2023 : మీరు స్థిరమైన ఆదాయం ఇచ్చే మంచి పెట్టుబడి మార్గం కోసం చూస్తున్నారా? అయితే మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) సరైన ఎంపిక అవుతాయి. ఎఫ్‌డీలను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం లేదా ఆర్​బీఐ నియంత్రిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తుండటమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్​ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్​.. ఫిక్స్​డ్​ డిపాజిట్​లపై రూ.5 లక్షల వరకు బీమా అందిస్తుంది. దీని వల్ల మీరు డబ్బు నష్టపోయే అవకాశాలు బాగా తక్కువ అవుతాయి.

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‎లో పెట్టుబడి పెడితే, మొదట్లోనే వడ్డీ రేటు నిర్ణయిస్తారు. కనుక గ్యారెంటీ రిటర్న్స్‎కి హామీ ఉంటుంది. ఎందుకంటే ఎఫ్‌డీ రేట్లు మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉండవు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్​.. మార్కెట్​ ఒడుదొడుకుల ప్రభావానికి గురవుతాయి. కానీ ఎఫ్​డీలపై ఈ ప్రభావం ఉండదు కనుక వీటి నుంచి స్థిరమైన రాబడి వస్తుంది. అందువల్ల రిస్క్​ లేని ఇన్వెస్ట్​మెంట్​ కోసం ఫిక్స్​డ్ డిపాజిట్లు ఎంచుకోవడం మంచిది.

బ్యాంకు వడ్డీ రేట్లు
ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. అవి నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి లేదా ఒకేసారి ఎఫ్‌డీ మెచ్యూర్ అయిన తర్వాత మీ అకౌంట్లో జమ అవుతాయి. మీ ఆర్థిక అవసరాలను అనుసరించి ఈ పేఅవుట్​ పీరియడ్​ను ఎంపిక చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఒక మెచ్యూరిటీ కాలం లేదా నిర్ణీత కాలం ఉంటుంది. అయితే అవి కొంత వరకూ లిక్విడిటీని అందిస్తాయి. కొన్ని ఎఫ్‌డీలు ముందస్తు ఉపసంహరణలను అనుమతించినప్పటికీ, దానికి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది లేదా తక్కువ వడ్డీ రేటుకే ఫిక్స్​డ్ డిపాజిట్​ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

పోర్ట్​ఫోలియో బ్యాలెన్స్ కోసం!
మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మీ పోర్టుఫోలియోలో కచ్చితంగా తక్కువ రిస్క్​తో, స్థిరమైన పెట్టుబడి ఇచ్చే ఎఫ్‌డీలను చేర్చుకోవడం ఎంతైనా ముఖ్యం. మీ పోర్ట్‌ఫోలియోలోని మొత్తం రిస్క్‌ని బ్యాలెన్స్ చేయడంలో మరియు తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అదీకాక, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి, ఫైనాన్సియల్​ మార్కెట్ల మీద లేదా ఆర్థిక పోకడల మీద పెద్దగా అవగాహన ఉండాల్సిన అవసరం కూడా లేదు.

మీరు ఫిక్స్​డ్ డిపాజిట్లలో కచ్చితంగా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలించడం మంచిది. ఎందుకంటే ఇవి మీ పెట్టుబడికి సెక్యూరిటీని అందిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కాలాలకి అందించే ఎఫ్‌డీ వడ్డీ రేట్లను చూద్దాం.

బ్యాంకు పేరు 1 సంవత్సరం1-2 సంవత్సరాలు2-3 సంవత్సరాలు 3-5 సంవత్సరాలు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 76.7565.75
బ్యాంక్ ఆఫ్ బరోడా 5.757.257.056.5
బ్యాంక్ ఆఫ్ ఇండియా5.576.756.5
కెనరా బ్యాంక్ 6.57.256.856.8
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా5.57.16.56.25
ఇండియన్ బ్యాంక్ 7.057.256.76.25
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్5.357.256.86.5
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.87.2576.5
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్67.356.756.25
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.757.176.5
యు.సి.ఓ బ్యాంక్ 67.056.36.2
యూనియన్ బ్యాంక్ 5.2576.56.7

గమనిక: ఈ పట్టికకు ఆయా బ్యాంకుల వెబ్ సైట్లలో 2023 జులై 21 నాటికి ఉన్న డేటా ఆధారితం. రూ.1 కోటి కంటే తక్కువ ఉన్న సాధారణ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.