ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : May 23, 2022, 1:30 PM IST

gold rate
గోల్డ్ రేట్​

Gold Rate: బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52వేల 810 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63,554కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీ విలువ స్వల్పంగా తగ్గింది.

Gold Price Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 52 వేల 810 వద్ద ఉంది. వెండి ధర కూడా కాస్త వృద్ధి చెందింది. ప్రస్తుతం రూ.63,554 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,810గా ఉంది. కిలో వెండి ధర రూ.63,554 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,554గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,810గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,554 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,810గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,554 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర పెరిగింది. ఔన్సు బంగారం 1,856 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే తగ్గింది. ప్రస్తుతం రూ. 23,72,574 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,72,574
ఇథీరియంరూ.1,60,963
టెథర్రూ.77.53
బినాన్స్​ కాయిన్రూ.25,524
యూఎస్​డీ కాయిన్రూ.81.51

ఇదీ చదవండి: భారత్​పై దృష్టి సారించిన యాపిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.