ETV Bharat / business

Gold Rate Today : ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

author img

By

Published : Jul 20, 2023, 10:29 AM IST

Gold, Silver, Stocks, Fuel Prices Today
స్థిరంగా బంగారం ధర​..పెరిగిన సిల్వర్​ రేట్​​​​​.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర​​ స్థిరంగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,190గా ఉంది. మరోవైపు వెండి ధర పెరిగింది. బుధవారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.495 పెరిగి రూ.78,050 పలుకుతోంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,190గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,050గా కొనసాగుతోంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050 పలుకుతోంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1976 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్​ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,56,152 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్​, బైనాన్స్​ కాయిన్​, యూఎస్​డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,56,152
ఇథీరియం రూ.1,55,374
టెథర్​ రూ.82.4
బైనాన్స్ కాయిన్ రూ.19,796
యూఎస్​డీ కాయిన్​ రూ.82.4

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.98.78గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 6 పైసలు పెరిగి రూ.82.02 వద్ద కొనసాగుతోంది.

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : గురువారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ సెన్సెక్స్​ 194 పాయింట్లు నష్టపోయి 66,903 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 40.30 పాయింట్లు క్షీణించి 19,793 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
రిలయన్స్​, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐఎన్​, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతి ఎయిర్​టెల్​ కంపెనీల్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
యాక్సిస్​ బ్యాంక్​, మారుతీ, ఐటీసీ, టెక్​ మహీంద్రా, టైటాన్​ మోటార్స్​, టైటాన్​, నెస్లే, ఎల్​ అండ్​ టీ, టీసీఎస్​ సహ మరి కొన్ని ప్రముఖ కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.