ETV Bharat / business

Gold Rate Today 30th August 2023 : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 9:50 AM IST

Updated : Aug 30, 2023, 10:02 AM IST

Gold Rate Today 30th August 2023
Gold And Silver Rates Today 2023 30th August

Gold Rate Today 30th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 30th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. మంగళవారం.. 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,075గా ఉండగా.. బుధవారం రూ.928 పెరిగి రూ.61,003కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,050గా ఉండగా.. బుధవారం నాటికి రూ.820 పెరిగి రూ.76,870కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 30th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,003గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,870గా ఉంది.
  • Gold Price In Vijayawada 30th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,003గా ఉంది. కిలో వెండి ధర రూ.76,870గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 30th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,003గా ఉంది. కిలో వెండి ధర రూ.76,870గా ఉంది.
  • Gold Price In Proddatur 30th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,003గా ఉంది. కిలో వెండి ధర రూ.76,870గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 30th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్​​ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1926 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1937 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరల దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.64 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 30th August 2023 : బుధవారం ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ లాభాల జోరును ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,64,653 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,64,653
ఇథీరియంరూ.1,42,074
టెథర్​రూ.82.67
బైనాన్స్ కాయిన్​రూ.18,615
యూఎస్​డీ కాయిన్​రూ.82.67

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 30th August 2023 : వరుసగా మూడోరోజూ దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 306 పాయింట్లు లాభపడి 65,380 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 19,420 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
జియోఫిన్​, యాక్సిస్​ బ్యాంక్​, టాటాస్టీల్, ఎం అండ్​ ఎం, టెక్​మహీంద్రా, ఐసీఐసీఐ, మారుతీ, టాటామోటార్స్, భారతీఎయిర్​టెల్, టైటాన్, ఇన్ఫీ, టీసీఎస్, ఎల్​ అండ్​ టీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, సన్​ఫార్మా, కోటక్​ బ్యాంక్, రిలయన్స్​, విప్రో, ఐటీసీ, హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
ఏషియన్​ పెయింట్స్, ఎన్టీపీసీ, పవర్​గ్రిడ్​ స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 30th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు ఎగబాకి రూ.82.69 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 30th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated :Aug 30, 2023, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.