ETV Bharat / business

Floating Rate Savings Bonds : రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆర్​బీఐ పోర్టల్​లోనే 'ఫ్లోటింగ్ బాండ్స్​' కొనుగోలుకు ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 1:21 PM IST

Floating Rate Savings Bonds News In Telugu : రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా.. రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్​ చెప్పింది. ఇకపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆర్​బీఐ పోర్టల్​ నుంచే నేరుగా ఫ్లోటింగ్​ రేట్ సేవింగ్స్​ బాండ్స్​ను కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు మీ కోసం..

rbi retail direct scheme
Floating Rate Savings Bonds

Floating Rate Savings Bonds : రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్​. ఆర్​బీఐ చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్​లో.. ఇకపై రిటైల్ ఇన్వెస్లర్లు కూడా నేరుగా 'ఫ్లోటింగ్​ రేట్ సేవింగ్స్ బాండ్స్​, 2020' కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చింది.

పెట్టుబడి అవకాశాలు!
RBI Retail Direct Scheme : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 నవంబర్​ 12న ఆర్​బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్​ను ప్రారంభించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను మరింత సులభతరం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రిటైల్​ ఇన్వెస్టర్లు ఈ స్కీమ్​లో చేరాలంటే.. ముందుగా ఆర్​బీఐ డైరెక్ట్ పోర్టల్​లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఖాతా తెరచిన తరువాత.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్​ల్లోని ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా మదుపు చేసుకోవచ్చు.

ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్స్​!
RBI Portal Investment Options : ఇప్పటి వరకు రిటైల్ ఇన్వెస్టర్లు.. ఆర్​బీఐకు చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్​ ద్వారా.. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్​ బాండ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్లోటింగ్​ బాండ్లను కూడా చేర్చడం జరిగింది.

కాలపరిమితి ఎంత?
Floating Rate Savings Bonds 2020 Time Limit : రిటైల్​ డైరెక్ట్ పోర్టల్​లో అందించే ఉత్పత్తులను మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే.. ఆర్​బీఐ తాజాగా 'ఫ్లోటింగ్​ రేట్ సేవింగ్స్ బాండ్స్'​ సబ్​స్క్రిప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్ల కాలపరిమితి 7 ఏళ్లు. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తరువాత.. కచ్చితంగా 7 ఏళ్ల పాటు ప్రతిఫలం కోసం వేచిచూడాల్సి ఉంటుంది.

ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు?
Floating Rate Savings Bonds 2020 Investment Limit : ఇన్వెస్టర్లు కనిష్ఠంగా రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ఠ పెట్టుబడి మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈ బాండ్ల పెట్టుబడి, ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
Floating Rate Savings Bonds 2020 Interest Rate : ఈ ఫ్లోటింగ్​ రేట్​ సేవింగ్స్​ బాండ్ల వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వాస్తవానికి ఈ బాండ్స్​ వడ్డీ రేట్లు అనేవి.. నేషనల్​ సేవింగ్స్ స్కీమ్​తో ముడిపడి ఉంటాయి. అయితే ఈ బాండ్లకు.. NSC స్కీమ్ అందించే వడ్డీ రేట్ల కంటే 0.35 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ బాండ్లపై 7.70% + 0.35% = 8.05% వడ్డీ అందిస్తున్నారు. ఏడేళ్లపాటు డబ్బులతో అవసరం లేనివాళ్లు.. ఫిక్స్​డ్​ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫ్లోటింగ్​ రేట్ సేవింగ్స్ బాండ్లపై ఇన్వెస్ట్​ చేయవచ్చు.

EPF Advance For Marriage : పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!

Post Office Monthly Income Scheme Details : ఒక్కసారి ఈ పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడితో.. నెలనెలా చేతికి డబ్బులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.