ETV Bharat / business

మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్​కార్ట్​.. త్వరలోనే 'బిగ్​ దీపావళి సేల్​'

author img

By

Published : Oct 17, 2022, 7:58 PM IST

Flipkart Big Diwali Sale 2022 : దీపావళిని పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌ మరో దఫా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు సహా అనేక వస్తువులపై ప్రత్యేక రాయితీ లభించనుంది.

flipkart big diwali sale 2022 date
flipkart big diwali sale 2022 date

Flipkart Big Diwali Sale 2022 : దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించిన ఓ దఫా ప్రత్యేక సేల్‌ అక్టోబరు 16తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ముందుకొచ్చింది. 'బిగ్‌ దీపావళి సేల్‌' పేరిట అక్టోబర్‌ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు రెండో దఫా సేల్‌ నిర్వహించనుంది. ఇప్పటి వరకు పండగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు నిర్వహించిన ప్రత్యేక సేల్‌లో పాల్గొననివారు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యత్వం ఉన్నవారు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. అంటే 18వ తేదీ అర్ధరాత్రి నుంచే వీరికి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లు రాయితీ ధరకు లభించనున్నాయి. దీనికి అదనంగా బ్యాంకులు ప్రకటించే ఆఫర్లతో మరింత తగ్గింపు వచ్చే అవకాశం ఉంది. ఎస్‌బీఐ కార్డుతో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేవారికి ఈ బిగ్‌ దీపావళి సేల్‌లో అదనంగా 10 శాతం రాయితీ లభించనుంది. పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. రియాల్‌మీ, పోకో, శాంసంగ్‌, ఒప్పో, వివో, యాపిల్‌ ఐఫోన్‌, షియోమీ, మోటోరోలా, ఇన్ఫీనిక్స్‌, మైక్రోమాక్స్‌, లావా మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా రియాల్‌మీ సీ33, పోకో సీ31, ఒప్పో కే10 5జీ, రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, అవేంటన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు రాయితీ ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. టీవీలు, గృహోపకరణాలు, వాషింగ్‌ మెషీన్‌లు, ఏసీలపై 75 శాతం వరకు తగ్గింపు ఉన్నట్లు పేర్కొంది.

ఇవీ చదవండి: పండుగల వేళ ఫుల్​ గిరాకీ.. ఆన్​లైన్​లో రూ.2.5 లక్షల కోట్ల విక్రయాలు

'అది రూపాయి పతనం కాదు.. డాలర్ బలపడటం'.. నిర్మలా సీతారామన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.