ETV Bharat / business

హెల్త్‌ ఇన్సూరెన్స్​ మిస్టేక్స్ - ఈ తప్పులు చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 2:25 PM IST

health insurance policy
health insurance policy

Reasons for Health Insurance Claim Rejection: ప్రస్తుత కాలంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. అయితే.. బీమా తీసుకునే సమయంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. దీంతో.. ఫ్యూచర్​లో క్లెయిమ్​ చేసుకునేటప్పుడు సమస్యలు వస్తున్నాయి! కొందరికి డబ్బులు చాలా తక్కువగా వస్తే.. మరికొందరి క్లెయిమ్​ పూర్తిగా రిజెక్ట్​ అవుతోంది..!

Common Reasons to Reject the Health Insurance Claim: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని.. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుంటున్నారు. అయితే.. పాలసీ తీసుకునే సమయంలో కొందరు కొన్ని మిస్టేక్స్​ చేస్తున్నారు. దీంతో.. పాలసీ యాక్టివ్​గా ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో బెనిఫిట్స్​ పొందలేకపోతున్నారు. మరికొందరికి రూపాయి కూడా రావట్లేదు. మరి.. ఆ తప్పులు ఏంటి? బీమా క్లెయిమ్​ రిజెక్ట్​ కావడానికి కారణాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

పాలసీ నిబంధనలు : జనాల్లో చాలా మందికి పాలసీ పేరు.. దానివల్ల ఒనగూరే ప్రయోజనం మాత్రమే తెలుసు. కానీ.. టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ గురించి మాత్రం తెలియదు. కొందరికి నిబంధనలను సరిగా చదవరు.. మరికొందరు మధ్యవర్తులు చెప్పిన సగం సగం విషయాలు తెలుసుకొని పాలసీ తీసుకుంటారు. చివరలో.. బీమా సంస్థ క్లెయిమ్​ రిజెక్ట్ చేస్తే లబోదిబోమంటారు. ఈ పరిస్థితి రావొద్దంటే ముందుగా రూల్స్ క్లియర్​గా చదవాలి.

దాచకూడదు : మరికొందరు ముందు నుంచి ఉన్న వ్యాధిని దాచిపెట్టి పాలసీ తీసుకుంటారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్ అయితే బాధపడతారు. అందుకే.. అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే.. ముందుగానే ఇన్సూరెన్స్​ కంపెనీకి చెప్పాలి. అప్పుడు మీరు ఎలాంటి పాలసీ తీసుకుంటే బాగుంటుందో వారు సలహా ఇస్తారు. పాలసీ క్లెయిమ్ సమయంలోనూ ఎలాంటి సమస్యా ఉండదు. ఇలా కాకుండా.. మీ సమస్యను దాచిపెట్టి పాలసీ తీసుకుంటే.. క్లెయిమ్ రిజెక్ట్​ చేసే అవకాశం ఉంటుంది. దీనిపై లీగల్‌గానూ పోరాడలేరు.

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

వెయిటింగ్​ పీరియడ్​ : మీరు ఒక పాలసీ తీసుకున్న తర్వాత వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. కొన్ని పాలసీలు ఒకటి నుంచి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత గానీ క్లెయిమ్​ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీనినే "వెయిటింగ్‌ పీరియడ్‌" అంటారు. ఈ సమయం పూర్తయ్యే వరకూ.. ఆయా అనారోగ్యాలకు ట్రీట్​మెంట్​ కోసం మీరు క్లెయిమ్‌ చేసుకోలేరు. కిడ్నీ, పార్కిన్సన్స్, అల్జీమర్స్, HIV వంటివి రోగాలు ఇందులో ఉంటాయి. అందువల్ల వెయిటింగ్​ పీరియడ్​ గురించి ముందుగానే తెలుసుకుని.. ఓకే అనుకుంటేనే పాలసీ తీసుకోండి.

బిల్లులు జాగ్రత్త : మీ పాలసీలో క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ సౌకర్యం ఉండేలా చూసుకుంటే ‌మంచిది. అదే సమయంలో చికిత్స సమయంలో ట్రీట్​మెంట్​కు సంబంధించిన అన్ని బిల్లులనూ జాగ్రత్త చేయండి. వాటిని బీమా కంపెనీ ఎప్పుడైనా అడగొచ్చు. క్లెయిమ్ సమయంలో హాస్పిటల్ బిల్స్​, డిశ్చార్జ్ ఫారమ్​, పేషెంట్ రికార్డ్‌లను సక్రమంగా జతచేస్తే మీ క్లెయిమ్‌ను ఎవరూ తిరస్కరించలేరు.

Family Floater Health Insurance Plan : ఈ హెల్త్ పాలసీ చూశారా..? పుట్టిన పిల్లలకు కవరేజీ నుంచి మరెన్నో బెనిఫిట్స్!

కస్టమర్ కేర్‌తో మాట్లాడండి: కొన్నిసార్లు మనం తీసుకోవడానికి.. ఏజెంట్లు కొన్ని విషయాలు దాచి పెడతారు. ఆ తర్వాతగానీ మోసపోయామనే విషయం అర్థం కాదు. అందుకే.. మీకు ఏవైనా డౌట్స్​ ఉంటే కస్టమర్ కేర్‌తో మాట్లాడాలి. సందేహాలన్నీ పూర్తిగా తీరిన తర్వాతనే పాలసీ తీసుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ - ఈ విషయాలు తెలుసా?

హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

iShield insurance : ఒకే​ పాలసీతో జీవిత, ఆరోగ్య బీమాలకు గ్యారెంటీ.. ఆ పథకం ఏమిటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.