ETV Bharat / business

National Savings Certificate Vs Public Provident Fund : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ Vs పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ఏది బెస్ట్..?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 10:15 AM IST

National Savings Certificate - Public Provident Fund : పోస్టాఫీసు పథకాలైన.. "నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్", "పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.." ఈ రెండింట్లో ఇన్వెస్ట్‌‌మెంట్‌కి ఏది బెస్ట్..? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి..? బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే ఏ స్కీమ్ ద్వారా మెరుగైన లబ్ధి పొందవచ్చు..??

National Savings Certificate Vs Public Provident Fund
National Savings Certificate Vs Public Provident Fund

Best Post Office Saving Schemes in Telugu : ఎవరైనా భవిష్యత్తులో మంచి లాభాలు అందించే పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ సమయంలో చాలా మంది రెగ్యులర్ ఆదాయంతో తక్కువ రిస్క్ తీసుకునే పథకాల వైపు చూస్తారు. ఎందుకంటే.. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్ పాలసీ(Investment Policy)లో పెట్టుబడి పెట్టాలంటే రిస్క్ ఉంటుంది. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ అద్భుతమైన పొదుపు పథకాలు అందిస్తోంది. ఈ లిస్టులో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) లాంటి పథకాలు ఉన్నాయి. అయితే.. వీటిలో దేంట్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది? అధిక లాభాలు ఎందులో వస్తాయి? అలాగే తక్కువ కాలంలో మంచి రిటర్న్స్​ ఎందులో వస్తాయని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..? పూర్తి వివరాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

National Saving Certificate : నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(NSC) అనేది పోస్టాఫీసు ద్వారా 5 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే స్థిర ఆదాయ పొదుపు పథకం. మధ్యతరగతి ప్రజలకు తక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్​లో ఒకేసారి డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. నెలవారీ కంట్రిబ్యూషన్ చేయడం ఇందులో కుదరదు. పోస్టాఫీస్​లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం రూ.1,000 చాలు. ఆ తర్వాత ఎంత డబ్బు అయినా జమ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంత పొదుపు చేయాలనుకున్నా ఒకేసారి చేయాలనే విషయం పాలసీదారు గుర్తుంచుకోవాలి. జులై 1, 2023 నాటికి ఈ స్కీమ్​లో వడ్డీరేటు 7.7 శాతానికి పెరిగింది.

నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ప్రయోజనాలు(National Saving Certificate Benefits) : దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్​లలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి పథకం. పన్ను ప్రయోజనాలతో పొదుపు చేసేలా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం ఈ స్కీమ్ లక్ష్యం. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా(ముగ్గురు వరకు) లేదా మైనర్ కోసం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​ను పోస్టాఫీస్​లో అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఎవరైనా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఎంత పొదుపు చేసినా ఐదేళ్ల వరకు వేచి చూడాలి. మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు వడ్డీ కూడా ఈ స్కీమ్​లో వస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పథకం ద్వారా ₹1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund) : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన దీర్ఘకాలిక పొదుపు పథకం. లాంగ్​టర్మ్ కు ఇది అత్యంత అనుకూలంగా ఉండే పెట్టుబడి సాధనం. దీంట్లో రిటర్న్స్ పూర్తిగా పన్ను రహితం. ఈ పథకం మెచ్యురిటీ నాటికి గణనీయమైన ఫండ్​ను పొందడానికి మీరు కేవలం రూ.500తో ఈ అకౌంట్​ను తెరవచ్చు. భారతీయ పౌరుడు లేదా పౌరురాలు లేదా మైనర్ తరఫున సంరక్షకులు ఈ పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈ స్కీమ్​లో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు(Public Provident Fund Features) : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవధి కాలం 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఇందులో వడ్డీరేటు 7.1శాతంగా ఉంది. ఎన్​ఎస్​సీ లాగానే ఇది కూడా ఆదాయపు పన్ను(Income Tax) సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు రాయితీని అందిస్తుంది. అయితే.. 5 సంవత్సరాల పెట్టుబడి తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక ఉపసంహరణలు చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. పీపీఎఫ్(PPF) నెలవారీ డిపాజిట్లను అనుమతిస్తుంది. పీపీఎఫ్ కూడా బ్యాంకు ఎఫ్​డీల కంటే మంచి రిటర్స్స్ ఇస్తుంది. అయితే ఎన్​సీఎస్ వడ్డీరేట్ల పరంగా అధిక రాబడిని అందిస్తోంది. పైన పేర్కొన్న విషయాలను బేరీజు వేసుకొని ఏ స్కీమ్ బెటర్​ అనిపిస్తుందో దాంట్లో ఖాతా తెరిచి మంచి లాభాలను పొందండి.

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

పోస్ట్ ఆఫీస్ X స్టేట్ బ్యాంక్.. ఫిక్స్డ్​ డిపాజిట్​కు ఏది బెస్ట్? అధిక వడ్డీ ఎవరిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.