ETV Bharat / business

మహిళలకు గుడ్​న్యూస్- ఆ బ్యాంక్​లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 5:58 PM IST

Bank Of India Nari Shakti Savings Account : బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు శుభవార్త చెప్పింది. నారీ శక్తి కింద సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి రూ.కోటి వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించనుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్‌లు, వెల్‌నెస్ ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిచనుంది. నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకుందామా మరి.

Bank Of India Nari Shakti Savings Account Scheme
Bank Of India Nari Shakti Savings Account Scheme

Bank Of India Nari Shakti Savings Account Scheme : మహిళలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) బంపర్ ఆఫర్ ఇచ్చింది. మహిళల కోసం 'నారీ శక్తి' పేరిట ఒక ప్రత్యేక సేవింగ్స్​ అకౌంట్​ తీసుకొచ్చింది. ఇది 18 ఏళ్లు పైబడిన వారికి ఉద్దేశించింది. స్వతంత్ర ఆదాయ వనరులు ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ అకౌంట్​ను మహిళల ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడానికి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పుడు ఈ సరికొత్త సేవింగ్స్ ఖాతా ఫీచర్లు సహా బెనిఫిట్స్​ను తెలుసుకుందాం.

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ: ఈ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వారికి రూ. కోటి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇది మహిళా ఖాతాదారుల భద్రత, రక్షణకు భరోసా ఇస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్​, వెల్​నెస్ ఉత్పత్తులపై డిస్కౌంట్స్ :
నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసిన మహిళలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్‌లు, వెల్‌నెస్ ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తుంది. అలాగే బంగారం, డైమండ్ లాకర్ సౌకర్యాలపైనా ఆకర్షణీయ రాయితీలు పొందవచ్చు.

రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ:
ఇంకా నారీ శక్తి సేవింగ్స్ ఖాతా తీసుకున్న మహిళలకు రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ ఉంటుంది. దీంతో రుణ భారం వీరిపై తక్కువగా ఉంటుంది. రిటైల్ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించనక్కర్లేదు. ఈ స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఫ్రీగా క్రెడిట్ కార్డు వస్తుంది. ఎంతో సులభంగా దీనిని వినియోగించుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (POS) ట్రాన్సాక్షన్లలో గరిష్ఠ పరిమితి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. ఈ అకౌంట్ కావాలనుకునేవారు దేశంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఎక్కడికైనా తీసుకోవచ్చు. బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా ఈ అకౌంట్​ను తెరవొచ్చు.

'నారీ శక్తి సేవింగ్స్ ఖాతా అనేది సాధారణ సేవింగ్ ఖాతా మాత్రమే కాదు. సొంత ఆదాయ వనరుతో పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదించడానికి దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఒక కొత్త నారీ శక్తి ఖాతా తెరిచినప్పుడు, బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధికి రూ. 10 విరాళం ఇస్తుంది. ఈ మొత్తాన్ని వెనుకబడిన మహిళలు, బాలికల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వినియోగిస్తాం' అని పథకం లాంఛ్​ సందర్భంగా అని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా గుడ్​న్యూస్- కుటుంబం మొత్తానికి ఒకే అకౌంట్​! కళ్లు చెదిరే బెనిఫిట్స్​!

Joint Bank Account Benefits : జాయింట్​ అకౌంట్​ అంటే ఏంటి? అదెలా పని చేస్తుంది? లాభమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.