ETV Bharat / business

భారత్‌ నుంచి 1700 విమానాలకు ఆర్డర్లు.. ఎయిర్​ఇండియా నుంచే 500!

author img

By

Published : Feb 9, 2023, 6:59 AM IST

1700 aircraft orders from India
భారత్‌ నుంచి 1700 విమానాలకు ఆర్డర్లు

భారత్​లో వాణిజ్య విమానాల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఒకట్రెండేళ్లలో 1500 నుంచి 1700 వరకు విమానాలకు ఆర్డర్లు పెట్టే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ కాపా అంచనా వేసింది. ఎయిర్​ఇండియా ఒక్కటే 500 విమానాల వరకు ఆర్డరు పెట్టవచ్చని బుధవారం పేర్కొంది.

భారత విమానయాన కంపెనీలు వచ్చే ఒకట్రెండేళ్లలో 1500 నుంచి 1700 వరకు విమానాలకు ఆర్డర్లు పెట్టే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ కాపా అంచనా వేస్తోంది. ఎయిర్​ఇండియా ఒక్కటే 500 విమానాల వరకు ఆర్డరు పెట్టవచ్చని బుధవారం పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన కంపెనీలతో పోలిస్తే, భారత్‌లోని మొత్తం వాణిజ్య విమానాల సంఖ్య (సుమారు 700) తక్కువేనని కాపా గుర్తు చేసింది. మరిన్ని విమానాలను తెచ్చుకునే సామర్థ్యం, అవసరాలు కూడా భారత కంపెనీలకు ఉందని కాపా పేర్కొంది.

  • కరోనా అనంతరం అత్యంత ఆకర్షణీయ విమానయాన మార్కెట్‌గా అంతర్జాతీయ దృష్టిని భారత్‌ ఆకర్షిస్తోంది. ప్రతి విమానయాన కంపెనీ వచ్చే కొన్నేళ్లలో మరిన్ని విమానాలకు ఆర్డరు చేయొచ్చని అంచనా. వచ్చే దశాబ్ద కాలంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవి ఆ పనిచేస్తాయి.
  • విమానయాన రద్దీ పుంజుకునే విషయంలో ప్రపంచంలోనే భారత్‌ అత్యంత బలమైనదిగా ఉంది. వచ్చే 10 ఏళ్లలో భారత విమానయాన రద్దీ అంచనాలు, ఇపుడున్న విమానాల వయసును దృష్టిలో పెట్టుకుని వచ్చే 12-24 నెలల్లో 1500-1700 విమానాలకు భారత కంపెనీలు ఆర్డరు పెట్టే అవకాశం ఉంది.
  • భారత్‌లో విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతోంది. అంతర్జాతీయ విమానయాన మార్కెట్లోనూ పటిష్ఠ స్థానాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది.
  • ఎయిర్‌బస్‌, బోయింగ్‌లకు ఎయిర్​ఇండియా 500 వరకు విమానాలకు ఆర్డరు ఇవ్వొచ్చు. ఈ ఆర్డరు అనంతరం ఇండిగో తన విమానాల సంఖ్యను 500 నుంచి 1300కు పెంచుకోవచ్చు. కరోనాకు ముందు వరకు ఈ కంపెనీ 300 విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తూ వచ్చింది. కరోనా పరిణామాలతో ఆ ప్రణాళికను వాయిదా వేసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.