Stock Market news: సరికొత్త చరిత్ర- సెన్సెక్స్​ 60 వేల ప్రస్థానం ఇలా..

author img

By

Published : Sep 24, 2021, 10:19 AM IST

Updated : Sep 24, 2021, 11:38 AM IST

Sensex crosses 60k for the first time, స్టాక్​మార్కెట్లు

స్టాక్​ మార్కెట్ సూచీలు(Stock market today) నేడు (సెప్టెంబర్​ 24) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్​ తొలిసారి 60 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. 1990లో తొలిసారి 1000 మార్కును దాటిన సెన్సెక్స్(Stock market news) ​.. ఆ తర్వాత ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శుక్రవారం అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇప్పటివరకు సెన్సెక్స్​ ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి చూద్దాం.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో (Stock market today) మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం.. సెన్సెక్స్‌(BSE sensex) ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 18000 కీలక మైలురాయి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు(US Stock market news) కూడా చివరి సెషన్​లో భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలు కూడా బుల్‌ రంకెకు కారణమవుతున్నాయి.

Stock Market news
60 వేల మార్క్​ దాటిన సందర్భంగా బీఎస్​ఈ శుభాకాంక్షలు

సెన్సెక్స్.. 60 వేల ప్రస్థానం

దలాల్​ స్ట్రీట్​ కొనుగోళ్లతో స్టాక్​మార్కెట్(Stock market news) ​ కళకళలాడుతోంది. ఫలితంగా.. సెన్సెక్స్​ కొత్త రికార్డుల్లో దూసుకెళ్తోంది. సెన్సెక్స్​ 60 వేల మార్కును చేరిందిలా..

1990లో తొలిసారి 1000 మార్క్‌ను దాటి..

Stock Market news
సెన్సెక్స్​ ప్రస్థానం ఇలా..

దాదాపు 30 ఏళ్ల క్రితం 1990లో తొలిసారిగా 1000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌.. అంచెలంచెలుగా 60 వేల మార్క్‌కు చేరింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌, సత్యం లాంటి కుంభకోణాలు.. జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా మహమ్మారి.. ఇలా ఎన్నో ఘటనలు మార్కెట్‌పై(Stock market live updates) తీవ్ర ప్రభావం చూపాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వ సంస్కరణలు, కొవిడ్‌ టీకాలకు ఆమోదం వంటి పరిణామాలు సూచీలను నిలబెట్టాయి. అలా నేడు సెన్సెక్స్‌ 60 వేలకు చేరింది. ఈ సందర్భంగా సూచీ ప్రస్థానాన్ని ఓసారి క్షుణ్ణంగా చూస్తే..

  • 1990 జులై 25న సానుకూల వర్షపాతం, కార్పొరేట్‌ ఫలితాలతో సెన్సెక్స్‌ తొలిసారిగా 1000 మార్క్‌ను దాటింది.
  • అయితే సెన్సెక్స్‌ 10వేల మార్క్‌ను చేరడగానికి దాదాపు 16ఏళ్లు పట్టింది. 2006 ఫిబ్రవరి 7న 10,000 మైలురాయిని దాటింది.
  • ఆ తర్వాతి సంవత్సరమే అంటే 2007 డిసెంబరు 11న సూచీ 20,000 మార్క్‌ను చేరుకుంది.
  • మళ్లీ ఎనిమిదేళ్లకు 2015 మార్చి 4న రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్లను తగ్గించడంతో 30వేల మైలురాయిని దాటింది.
  • ఆ తర్వాత నుంచి సెన్సెక్స్‌ వేగం పుంజుకుంది. 2019 మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో తొలిసారిగా 40వేల మార్క్‌ను చేరింది.

9 నెలల్లో 93శాతం పెరిగి..

గతేడాది మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సెన్సెక్స్‌ (Stock market today) కూడా తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఒకదశలో గతేడాది మార్చి నెలలో 25,638.90కి పడిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన సూచీ.. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. కేవలం 9 నెలల్లోనే సూచీ 93 శాతం పెరిగి.. 2021 జనవరి 21న సెన్సెక్స్‌ 50వేల మైలురాయిని అధిగమించింది.

ఆ తర్వాత క్రమక్రమంగా దేశంలో కరోనా తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్​ పెరగడం మూలంగా.. మార్కెట్లు వెనక్కి తగ్గలేదు.

2021 ఆగస్టు 13న 55 వేల మార్కు దాటింది.

మరో నెల రోజుల్లోనే దూసుకెళ్లి సరికొత్త శిఖరాలకు చేరింది సెన్సెక్స్​. 2021 సెప్టెంబర్​ 24న 60 వేల మరపురాని మైలురాయిని అధిగమించింది.

సెన్సెక్స్‌ పయనం సాగిందిలా..

1,000 07-25-1990
5,000 11-10-1999
10,000 07-02-2006
15,000 09-17-2007
20,000 11-12-2007
25,000 05-06-2014
30,000 26-04-2017
35,000 17-01-2018
40,000 03-06-2019
45,000 04-12-2020
50,000 03-02-2021
55,000 13-08-2021
60,000 24-09-2021

Stock Market news
2021లో సెన్సెక్స్​ మైలురాళ్లు..

ఇవీ చూడండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా 500 మంది.. ఎలాగంటే?

ప్రజలపై జీఎస్‌టీ పెనుభారం- సహేతుక పన్నులే సమంజసం!

Last Updated :Sep 24, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.