ETV Bharat / business

మార్కెట్లపై అమెరికా ద్రవ్యోల్బణం దెబ్బ.. రూ.3.39 లక్షల కోట్లు ఆవిరి!

author img

By

Published : Feb 11, 2022, 12:45 PM IST

Investors' wealth tumble over Rs 3.39 lakh cr in early trade
బేర్​ పంజా

stock market news: అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ ప్రభావం భారతీయ స్టాక్​మార్కెట్​ల మీద పడింది. దీంతో సూచీలు నేల చూపులు చూశాయి. ఈ భారీ నష్టాలకు రూ. 3.39లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది.

stock market news: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో దేశీయంగా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. తొలుత ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు గంట గంటకు కనిష్ఠాలను చేరుతున్నాయి. ఓ దశలో బీఎస్​ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈరోజు భారీగా పడిపోయింది. సుమారు రూ.3.39 లక్షల కోట్లు ఆవిరైనట్లు నిపుణులు చెప్తున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.33 వద్ద చలిస్తోంది.

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో వడ్డీరేట్ల పెంపును ఫెడ్‌ మరింత వేగంగా పెంచనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఫలితంగా గురువారం అక్కడి మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. దేశీయంగా చూస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.63 శాతం కుంగగా.. స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.61 శాతం పడింది. బీఎస్‌ఈలో మెజారిటీ షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి.

లాభనష్టాలు..

టాటా స్టీల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు మినహా ముప్పై షేర్ల ఇండెక్స్​లో అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:

'ఆర్థిక వ్యవస్థ కుదేలైనా.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.