Stock Market Live: భారీ నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 500 డౌన్
Updated on: Mar 15, 2022, 2:03 PM IST

Stock Market Live: భారీ నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 500 డౌన్
Updated on: Mar 15, 2022, 2:03 PM IST
13:51 March 15
దేశీయ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమై.. 56 వేల దిగువన ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ... 172 పాయింట్లు తగ్గి.. 16,699 వద్ద కదలాడుతోంది.
ముప్పై షేర్ల సూచీలో ఎం అండ్ ఎం, మారుతి, టైటాన్, ఏషియన్పెయింట్, అల్ట్రాటెక్సిమెంట్ బజాజ్ఫిన్సెర్వ్ మినహా అన్ని నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
09:11 March 15
Stock Market Live: తీవ్ర ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్ సూచీలు
Stock Market: స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. అయితే.. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా పెరిగి.. 56,560 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 880 వద్ద ట్రేడవుతోంది.
