బడ్జెట్​ రూ.8 కోట్లు - కలెక్షన్స్ అంతకుమించి - ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి మూడు నేషనల్ అవార్డులు కూడా - Vidya Balan Kahaani Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 10:49 AM IST

ni Movie Awards
ni Movie Awards ()

Vidya Balan Kahaani Movie : చిన్న చిత్రంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్​తో విడుదలైన సినిమాలను మనం చాలానే చూసుంటాం. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన 'కహానీ' మూవీ, బాలీవుడ్​ అత్యంత కలెక్షన్లు అందుకున్న సినిమాల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. ఆ విశేషాలు మీ కోసం

Vidya Balan Kahaani Movie : ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ సాధించాయి. బడ్జెట్​తో సంబంధం లేకుండా చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అయ్యాయి. ఆయా స్టార్ల కెరీర్​లను ఓ రేంజ్​లోకి తీసుకెళ్లాయి కూడా. కథ బాగుంటే ఎటువంటి సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టిన రోజులు కూడా సినీ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

అయితే పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటేనే సినిమా నడుస్తుందన్న కాలంలోనూ ఓ సినిమా ఈ అంచనాలన్నింటినీ దాటి చరిత్రెక్కెక్కింది. 2012లో వచ్చిన ఈ హీరోయిన్ ఓరియెంటడ్​ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ టాక్ అందుకోవడమే కాకుండా అందులోని హీరోయిన్​ స్టార్​డమ్​న మరింత పెంచింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన 'కహానీ'.

ఆ ఏడాదిలో విడుదలైన సినిమాలలో బెస్ట్ సినిమాలలో ఇది ఒకటి. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.104 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. ఒక గర్భవతిగా విద్యా బాలన్ నటనకు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఉత్తమ నటిగా అవార్డులతో పాటు ఆ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ కు కూడా చాలా అవార్డులు వచ్చాయి. బెస్ట్ కథ, స్క్రీన్ ప్లే తో ఆ ఏడాది 3 జాతీయ అవార్డులు ఈ మూవీ సొంతం చేసుకుంది.

బెంగాలీ నటుడు పరంబ్రతా చటర్జీకు కూడా మంచి గుర్తింపుతో పాటు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆశ్చర్యంగా ఆ తర్వాత అతనికి వచ్చిన అవకాశాలు కూడా ఎక్కువ థ్రిల్లర్ సినిమా లేదా సిరీస్ లోనే అవకాశం వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది.

ఇక కహానీకి సీక్వెల్​గా 2016లో వచ్చిన 'కహానీ 2' అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను తెలుగు తమిళంలోనూ నయనతార లీడ్​ రోల్​లో పెట్టి తీశారు. అయితే ఆ చిత్రం అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది.

5 సెకన్ల సినిమా ఛాన్స్ - స్టార్​గా మారిన బిచ్చగాడు - గర్ల్ ఫ్రెండ్ కూడా! - PK Aamir Khan Movie

ఆ సినిమాపై 34 కేసులు, నటికి వేధింపులు - దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ ఏదంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.