ETV Bharat / business

లాభాల్లో మార్కెట్లు.. ఐటీ, విద్యుత్​ రంగం షేర్ల దూకుడు

author img

By

Published : Sep 8, 2020, 9:51 AM IST

Updated : Sep 8, 2020, 10:46 AM IST

stocks live
స్టాక్

10:43 September 08

stocks live
సెన్సెక్స్- 30 షేర్లు

లాభాల్లో మార్కెట్లు.. 

ఐటీ, విద్యుత్​ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్​ 254 పాయింట్లు లాభపడి 38,671 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

నిఫ్టీ 57 పాయింట్లు మెరుగై 11,412 పాయింట్లకు చేరుకుంది.  

09:35 September 08

భారత్​- చైనా ఉద్రిక్తతలు..

అంతర్జాతీయ ప్రతికూలతలు, భారత్​- చైనా ఉద్రిక్తతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 38491 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 4 పాయింట్లు మెరుగై 11,359 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

పవర్​గ్రిడ్​, కొటక్​ బ్యాంక్​, నెస్లే, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు నష్టాల్లో ఉండగా... దక్షిణ కొరియా, జపాన్​ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.  

అమెరికా స్టాక్​ ఎక్స్ఛేంజీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి.  

చమురు..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్​ చమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్​కు 41.95 డాలర్ల వద్ద స్థిరపడింది.  

Last Updated :Sep 8, 2020, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.