ETV Bharat / business

నష్టాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 642 పాయింట్లు వృద్ధి

author img

By

Published : Mar 19, 2021, 3:38 PM IST

వారంలో చివరిరోజైన శుక్రవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 642 పాయింట్లు బలపడింది. ఒక దశలో 50 వేల పైకి ఎగసింది. నిఫ్టీ 186 పాయింట్లు బలపడింది.

Market live Updates: Indices near day's high, Nifty above 14,700; FMCG, metal stocks gain
ఆరంభంలో నష్టాలొచ్చినా.. చివరకు లాభాలతో భళా

ఐదు రోజుల నష్టాలకు బ్రేకులు వేస్తూ దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదు చేశాాయి. వారాంతపు సెషన్​లో ఆరంభంలో ఒడుదొడుకుల మధ్య సాగినా.. చివరకు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 642 పాయింట్లు పెరిగి 49,858 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 14,744 వద్దకు చేరింది.

క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో గత ఐదు సెషన్​లుగా దేశీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. శుక్రవారం ఆరంభ సెషన్​లోనూ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే మిడ్​ సెషన్​ తర్వాత విద్యుత్​, ఎఫ్​ఎంసీజీ, లోహ షేర్లు భారీగా పుంజుకోవడం వల్ల లాభాలను నమోదు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,004 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,587 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,788 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 14,350 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభాల్లో ఉన్న షేర్లు..

హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, రిలయన్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లోనివి..

ఎల్ అండ్​ టీ, టెక్​ ఎం, ఓఎన్​జీసీ, బజాజ్​ ఆటో, టైటాన్​ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

ఇదీ చదవండి: ఆధార్‌, పాన్​ లింక్​ లేకుంటే రూ.10వేలు ఫైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.