ETV Bharat / business

భారీ లాభాల్లో ​మార్కెట్లు- 50వేల మార్క్​ దాటిన సెన్సెక్స్​

author img

By

Published : May 18, 2021, 9:22 AM IST

Updated : May 18, 2021, 11:31 AM IST

Indices trade higher
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్

11:15 May 18

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 637 పాయింట్లకు పైగా లాభపడి 50,220 వద్ద ట్రేడవుతోంది.  ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 190 పాయింట్లుకు పైగా పుంజుకుని 15,113 వద్ద కొనసాగుతుంది. 

దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అంతేగాక విదేశీ సంస్థాగత పెట్టుబడులు మార్కెట్​కు అండగా నిలిచాయి. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి.

లాభనష్టాలు..

  • పవర్​గ్రిడ్​, బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టెక్​ మహీంద్ర, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 
  • ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ​ 

08:35 May 18

స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్

స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512పాయింట్లకు పైగా లాభపడి50,092 వద్ద కొనసాగుతుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 169 పాయింట్లకు  వృద్ధి చెంది15,092 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాలు.. 

  • టాటాస్టీల్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్​ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, కోటక్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • నెస్లే, భారతీ ఎయిర్​ టెల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated :May 18, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.