ETV Bharat / business

తొలి రోజే లాభాల పంట- నిఫ్టీ 14వేల ప్లస్​

author img

By

Published : Jan 1, 2021, 3:51 PM IST

Updated : Jan 1, 2021, 4:24 PM IST

కొత్త ఏడాది తొలి రోజున లాభాలతో ముగిశాయి దేశీయ మార్కెట్లు. నిఫ్టీ తొలిసారి 14వేల పైన స్థిరపడింది. సెన్సెక్స్​ 118 పాయింట్లు లాభపడింది.

stock markets
సరికొత్త శిఖరాలకు మార్కెట్లు..

నూతన ఏడాదిలో సరికొత్త శిఖరాల వైపు దూసుకెళుతున్నాయి దేశీయ స్టాక్​ మార్కెట్లు. జీఎస్​టీ చెల్లింపుల్లో భారీ వృద్ధి, టీకా అందుబాటులోకి వస్తుందన్న అంచనాలకు తోడు ఐటీ, ఆటో రంగం, పీఎస్​యూ బ్యాంకు షేర్ల దన్నుతో కొత్త ఏడాది తొలి రోజు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి సూచీలు. తొలిసారి నిఫ్టీ 14 వేల ఎగువన స్థిరపడింది.

బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్​ ఇంట్రాడేలో ఒకానొక దశలో 47,980 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివరకు 118 పాయింట్ల లాభంతో 47,868 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. ఆరంభంలోనే 14 వేల ఎగువన ప్రారంభమై లాభాలను కాపాడుకుంది. ఒక దశలో 14,050 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు 37 పాయింట్ల వృద్ధితో 14,018 వద్ద ముగిసింది.

ఫలితంగా.... దేశీయ మార్కెట్లు వరుసగా 8 సెషన్లో లాభాలతో ముగిసినట్టయింది. డిసెంబర్​ 22 నుంచి సుమారు 5 శాతం వృద్ధి సాధించాయి సూచీలు.

లాభనష్టాల్లోనివి..

బీహెచ్​ఈఎల్​, భారత్​ ఎలక్ట్రానిక్స్​, పీఎన్​బీ, బ్యాంక్​ ఆఫ్​ బరోడా సుమారు 5 శాతం మేర లాభపడ్డాయి. ఐటీసీ, టీసీఎస్​, ఎస్​బీఐఎన్​, భారతీ ఎయిర్​టెల్​, అదానీ పోర్ట్​, ఎంఅండ్​ఎం లాభాలతో ముగిశాయి.

ఐసీఐసీ బ్యాంక్​, హిందాల్కో, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సురెన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లు 1 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోలిస్తే 4 పైసలు క్షీణించి 73.11 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి: మార్కెట్​ 2021: కొవిడ్​, టీకా​, బడ్జెట్​ వార్తలే కీలకం

Last Updated : Jan 1, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.