ETV Bharat / business

మార్కెట్లకు భారీ నష్టాలు-సెన్సెక్స్, నిఫ్టీ 3% డౌన్​

author img

By

Published : Sep 24, 2020, 9:41 AM IST

Updated : Sep 24, 2020, 4:01 PM IST

stock market
భారీ నష్టాల్లో మార్కెట్లు

15:50 September 24

ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు కుదేలు..

స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1115 పాయింట్లు (దాదాపు 3 శాతం) తగ్గి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 326 (దాదాపు 3 శాతం) పాయింట్ల నష్టంతో 10,805 వద్దకు చేరింది.

అన్ని రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.  

  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​యూఎల్​ మత్రమే స్వల్పంగా లాభాన్ని గడించింది. మిగత అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
  • ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది. బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్​, ఎం&ఎం, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి.

12:24 September 24

ఎం&ఎం 5 శాతం డౌన్..

మిడ్​ సెషన్ తర్వాత కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 770 పాయింట్లకుపైగా కోల్పోయి 36,891 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లకుపైగా నష్టంతో 10,906 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ ప్రతికూలతలతో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు.

  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​యూఎల్​ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉంది.
  • ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, టీసీఎస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

11:26 September 24

sensex
సెన్సెక్స్ 30 షేర్లు

భారీ నష్టాల్లోనే మార్కెట్లు..

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 632 పాయింట్లు నష్టంతో 37,036 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 180 పాయింట్ల కోల్పోయి 10,944 పాయింట్లకు పడిపోయింది.  

లాభనష్టాల్లో...

హిందుస్థాన్ యూనిలివర్​, కొటక్​ బ్యాంక్, నెస్లే స్వల్ప లాభాల్లో ఉన్నాయి.  

బజాజ్​ ఫైనాన్స్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్రా, టీసీఎస్​ 3 శాతానికిపైగా నష్టపోయాయి.  

09:31 September 24

మార్కెట్లపై అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం

అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 453 పాయింట్లు పతనమై 37,215 వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 10,987 పాయింట్లకు పడిపోయింది.  

సెన్సెక్స్-30, నిఫ్టీ-50లోని అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్​, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​ 2 శాతం మేర నష్టపోయాయి.  

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా వాల్​స్ట్రీట్​ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్​లో 3 శాతం మేర నష్టపోయాయి.  

ఆసియాలో జపాన్​, హాంకాంగ్, సింగపూర్​, షాంఘై, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. 

Last Updated : Sep 24, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.