ETV Bharat / business

ఒడుదొడుకుల ట్రేడింగ్​- ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

author img

By

Published : Jun 1, 2021, 3:37 PM IST

share market ,  stock market news
స్టాక్​ మార్కెట్, షేర్​మార్కెట్​

నేటి సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ స్వల్పంగా 2 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి ఫ్లాట్​గా ముగిసింది.

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. నేటి సెషన్​లో లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ స్వల్పంగా 2 పాయింట్లు నష్టపోయి 51,934 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 7 పాయింట్లు తగ్గి 15,574 వద్ద స్థిరపడింది.

దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, వ్యాక్సినేషన్‌ పురోగతి, కీలక కంపెనీలు రాణించడం కారణంగా ఉదయం సెషన్​లో సూచీలు లాభాల బాట పట్టాయి. అనంతరం రెండు రోజుల లాభాలను సొమ్ము చేసుకోవడానికి మదుపరులు మొగ్గుచూపగా.. సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,228 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,808 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,660 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,528 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ, బజాజ్​ ఆటో, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, హిందుస్థాన్​ యూనిలివర్​, టెక్​మహీంద్ర షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.