ETV Bharat / business

'ఆత్మనిర్భర్‌ భారత్' మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్​

author img

By

Published : Sep 25, 2020, 2:54 PM IST

కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్​' ఉద్దీపన ప్యాకేజీ మంచి ప్రయత్నమని ప్రశంసించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇది భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.

Modi's 'Aatmanirbhar Bharat' important initiative: IMF
'ఆత్మనిర్భర్‌ భారత్' మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్​

భారతదేశ స్వయం సమృద్ధి సాధన కోసం 'ఆత్మ నిర్భర్‌ భారత్' పేరిట ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మంచి ప్రయత్నమని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్). దీనికి సంబంధించి ఆ సంస్థ ఉన్నతాధికారి గెర్రీ రైస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్ పేరిట ప్రకటించిన ప్యాకేజీ.. ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చిందని, భారీ నష్టాలను తగ్గించిందని ఆయన ప్రశంసించారు.

" 'మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌' లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేసే విధానాలపై దృష్టిపెట్టాలి. మోదీ చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషించాలంటే.. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని మెరుగుపరిచి, ఉత్తేజమైన విధానాలను అనుసరించడం చాలా అవసరం"

- గెర్రీ రైస్, ఐఎంఎఫ్​ ఉన్నతాధికారి

ఆరోగ్య సంబంధిత స్థిరమైన లక్ష్యాలలో భాగంగా.. అధిక పనితీరు, సామర్థ్యం పెంచడానికి ఆ రంగంలో పెట్టే వ్యయాన్ని క్రమంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు గెర్రీరైస్​. ఈ మేరకు నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి ఐఎంఎఫ్ చేసిన అధ్యయనం గురించి ప్రస్తావించారు. స్థిరమైన వృద్ధిని సాధించడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.