ETV Bharat / business

ఉద్యోగులకు జీతాల పెంపుపై కార్మికశాఖ క్లారిటీ

author img

By

Published : Oct 16, 2020, 8:17 PM IST

ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికుల జీతాలు పెరుగుతాయంటూ వస్తోన్న వార్తలపై కార్మికశాఖ క్లారిటీ ఇచ్చింది. అవి వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. పారిశ్రామిక కార్మికులు- వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) నూతన సిరీస్​ త్వరలో విడుదల కానుంది.

CPI-IW series
ఉద్యోగులకు జీతాల పెంపుపై కార్మికశాఖ క్లారిటీ

పారిశ్రామిక కార్మికులు- వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) నూతన సిరీస్​తో.. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికుల జీతాల్లో పెరుగుదల ఉండదని స్పష్టం చేసింది కార్మిక మంత్రిత్వశాఖ. ఉద్యోగులకు ఇచ్చే డీఏ పెరుగుతుందన్న మీడియా కథనాలను కొట్టిపారేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు చెల్లించే కరవు భత్యం(డీఏ) లెక్కించడానికి సీపీఐ-ఐడబ్ల్యూ ఉపయోగపడుతుంది.

కొత్తగా..

అక్టోబర్​ 21న నూతన 'సీపీఐ-ఐడబ్ల్యూ' సిరీస్​ను విడుదల చేయనుంది కేంద్రం. ఇప్పటివరకు ఇందులో విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి 200 అంశాలను పరిగణనలోకి తీసుకోగా.. తాజాగా వాటి సంఖ్య 300కు పెంచనున్నారు. దాదాపు 90 ప్రాంతాల్లోని మార్కెట్ల లెక్కలను తీసుకొని సీపీఐ-ఐడబ్ల్యూ లెక్కగడతారు. అంతేకాకుండా ఇప్పటివరకు డీఏ లెక్కించడానికి 2001 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోగా.. ఇకపై 2016 ఆధారం చేసుకోనున్నారు.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన బంగారం ధర- 10గ్రాములు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.