ETV Bharat / business

మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

author img

By

Published : Dec 1, 2020, 2:27 PM IST

నవంబర్​లో జీఎస్​టీ వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి.

GST
జీఎస్టీ వసూళ్లు

దేశవ్యాప్తంగా అన్​లాక్​తో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలతో వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు పెరిగాయి. నవంబర్​లో మొత్తం జీఎస్​టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత జీఎస్​టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. అయితే అక్టోబర్​లో జీఎస్​టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

నవంబర్​లో జీఎస్​టీ వసూళ్ల లెక్క..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.19,189 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.25,540 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.51,992 కోట్లు
  • సెస్​- రూ.8,242 కోట్లు

ఇదీ చూడండి: నవంబర్​లో అదరగొట్టిన అమెరికా మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.