ETV Bharat / business

'ఫైజర్' ప్రకటనతో జూమ్​ షేర్లు రివర్స్ గేర్

author img

By

Published : Nov 10, 2020, 11:45 AM IST

లాక్​డౌన్​ కాలంలో రికార్డు స్థాయిలో లాభాలను గడించిన జూమ్​ షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. దీంతో జూమ్​ వ్యవస్థపాకుడు ఎరిక్​ యువాన్​ సంపద 5 బిలియన్​ డాలర్లకుపైగా తగ్గింది. కరోనా టీకాపై ఔషధ సంస్థ ఫైజర్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం.

Pfizer Vaccine impact on Zoom Shares
ఫైజర్ టీకా ప్రకటనతో జూమ్ షేర్లు పతనం

'జూమ్​'.. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్ సమయంలో మంచి ఆధరణ పొందిన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల సంస్థ. లాక్​డౌన్ సమయంలో కంపెనీల సమావేశాల నుంచి ఆన్​లైన్ క్లాసుల వరకు జూమ్​ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో జూమ్ కంపెనీ షేరు విలువ ఈ ఒక్క ఏడాదే దాదాపు 500 శాతం పెరిగింది. ఫలితంగా జూమ్ వ్యవస్థాపకుడు ఎరిక్​ యువాన్​ సంపద 28.6 బిలియన్ డాలర్లకు పెరిగి.. ప్రపంచ ధనవంతుల్లో 40వ స్థానంలో నిలిచారు.

ఫైజర్​ ప్రకటనతో దెబ్బ..

ఇంత వరకు బాగానే ఉన్నా.. అమెరికా మార్కెట్లలో జూమ్​ షేరు సోమవారం ఒక్కసారిగా భారీ స్థాయిలో(17 శాతానికిపైగా) కుదేలైంది. ఇందుకు ప్రధాన కారణం కొవిడ్ వ్యాక్సిన్​పై ఔషధ సంస్థ ఫైజర్ చేసిన ప్రకటన. తాము ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్​.. మానవులపై నిర్వహించిన పరీక్షల్లో 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ వస్తే..

ఈ ప్రకటనతో.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరొచ్చనే అంచనాలు పెరిగాయి. ఉద్యోగులు తమ కార్యాలయాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తే.. వీడియో కాన్ఫరెన్సింగ్​ వినియోగం భారీగా తగ్గుతుందనే అంచనాలతో జూమ్ షేర్లు ఈ స్థాయిలో పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సంపద తగ్గుదల ఇలా..

ఈ పరిణామాలన్నింటితో ఎరిక్​ యువాన్​ సంపద 5.1 బిలియన్ డాలర్లు తగ్గింది. దీనికి తోడు ఈ ఏడాది 275 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఈ ఏడాది విక్రయించడం వల్ల ఎరిక్​ యువాన్​ మొత్తం సంపద 20 బిలియన్​ డాలర్లకు దిగొచ్చినట్లు బ్లూమ్​బర్గ్ నివేదిక పేర్కొంది.

ఫైజర్ ప్రకటనతో లాక్​డౌన్​ సమయంలో భారీగా పుంజుకున్న నెట్​ఫ్లిక్స్, ఒకాడో గ్రూప్ వంటివి సోమవారం నష్టాలను నమోదు చేశాయి.

విమానయాన, ఆతిథ్యం, చమురు రంగ షేర్లు మాత్రం భారీగా లాభాలను గడించాయి.

ఇదీ చూడండి:'బీఎండబ్ల్యూ' సూట్​ వేసుకుంటే ఎగిరిపోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.