ETV Bharat / business

'అత్యధిక సంపద సృష్టి సంస్థగా రిలయన్స్​'

author img

By

Published : Dec 16, 2021, 5:15 AM IST

Reliance Industries wealth: గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రికార్డు సృష్టించింది. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుని..2015-19లో తానే నెలకొల్పిన రికార్డును బద్ధలుగొట్టింది. ఈ విషయం మోతీలాల్‌ ఓస్వాల్‌ తాజా నివేదికలో వెల్లడైంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విశేషాలు ఏంటంటే..?

Reliance Industries wealth
రిలయన్స్​ మోతీలాల్‌ ఓస్వాల్‌

Reliance Industries wealth: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌).. గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా ఘనత వహించింది.. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుంది. దీంతో 2015-19లో తానే నెలకొల్పిన రూ.5.6 లక్షల కోట్ల రికార్డును బద్దలుకొట్టింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ 26వ వార్షిక సంపద సృష్టి నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

Motilal Oswal: నివేదికలో కీలక అంశాలు..

  • Ril Wealth creator: దేశంలోని అగ్రగామి 100 కంపెనీలు గత అయిదేళ్లలో రూ.71 లక్షల కోట్ల సంపదను వెనకేశాయి. గత 26 అయిదేళ్ల కాలాల్లో ఇదే అత్యధికం.
  • Bse sensex cagr: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత అయిదేళ్లలో 14 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి(సీఏజీఆర్‌)ని నమోదు చేయగా.. ఈ కంపెనీలు మాత్రం ఏకంగా 25 శాతం ప్రతిఫలాలను అందించాయి. (బీఎస్‌ఈలో కంపెనీల షేర్ల ఆధారంగా ఆయా సంస్థల సంపదను లెక్కగట్టి అగ్రగామి 100 సంస్థల జాబితాను ప్రకటించారు.)
  • Reliance retail: భౌతిక, డిజిటల్‌ వ్యాపారాలను కలగలపడంతో వచ్చిన శక్తితో రిలయన్స్‌ తిరిగి అత్యంత ఎక్కువ సంపదను సృష్టించిన కంపెనీగా అవతరించింది. సంస్థకు చెందిన చమురు-రసాయనాలు, రిటైల్‌ వ్యాపారాలు భౌతిక రూపంలో బలాన్ని ఇవ్వగా.. డిజిటల్‌ విభాగాల్లో టెలికాం వ్యాపారం దూసుకెళ్లడం ఇందుకు సహాయం చేసింది.
    Motilal Oswal
    .
  • Adani group: అదానీ గ్రూప్‌ కంపెనీలైన అదానీ ట్రాన్సిమిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు అత్యంత వేగంగా(93 శాతం సీఏజీఆర్‌), అత్యంత స్థిరంగా (86% సీఏజీఆర్‌) సంపదను సృష్టించిన కంపెనీలుగా నిలిచాయి.
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంపద సృష్టిలో ఆల్‌ రౌండర్‌గా నిలిచింది.
  • అత్యంగా వేగంగా సంపదను సృష్టించిన టాప్‌-10 కంపెనీల్లో 2016లో రూ.10 లక్షలను సమానంగా పెట్టుబడి పెట్టి ఉంటే 2021లో 77 శాతం సీఏజీఆర్‌తో అది రూ.1.7 కోట్లకు చేరి ఉండేది.
  • రంగాల వారీగా అత్యధిక సంపదను సృష్టించిన వాటిలో ఆర్థిక రంగం తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో వినియోగదారు, రిటైల్‌ రంగం ఉంది. అంతక్రితం అయిదేళ్లలో 18 శాతం సంపద ఈ రంగం నుంచే రాగా.. ఈ సారి అది 25 శాతానికి చేరుకుంది. తమ వాటాను అధికంగా పోగొట్టుకున్నవాటిలో వాహన, ఫార్మా సంస్థలున్నాయి.
  • సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు చివర్లో నిలిచాయి. కేవలం గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌లు మాత్రమే జాబితాలో నిలిచాయి.

ఇవీ చూడండి:

వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!

ఈనెల 16,17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ సేవలు బంద్​!

ఆ బ్యాంకులకు ఆర్​బీఐ షాక్- రూ.కోటికి పైగా జరిమానా​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.