ETV Bharat / business

వాట్సాప్​లో ఇక మనీ ట్రాన్స్​ఫర్​... ఫ్రీగా...

author img

By

Published : Nov 6, 2020, 10:46 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​లో ఆర్థిక లావాదేవీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక నుంచి తమ యాప్​లో పేమెంట్స్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ అధినేత మార్క్ జుకర్​బర్గ్ వెల్లడించారు. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయమని తెలిపారు.

WhatsApp
వాట్సాప్​

వాట్సాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి రుసుము వసూలు చేయమని ఫేస్​బుక్​ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ వెల్లడించారు. వాట్సాప్‌లో శుక్రవారం నుంచి పేమెంట్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.

వాట్సాప్​లో యూపీఐ సేవలకు భారత జాతీయ లావాదేవీల సంస్థ (ఎన్​పీసీఐ) అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు మార్క్. ఆర్థిక సేవలకు సంబంధించి వాట్సాప్​నకు 140కిపైగా బ్యాంకులు సహకారాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.

ఈ పేమెంట్స్ ఆప్షన్​ను 10 భారతీయ భాషల్లో అందించనున్నట్లు మార్క్ తెలిపారు.

ఇదీ చూడండి: నెలాఖరుకల్లా వాట్సాప్​లో ఆ కొత్త ఫీచర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.