ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ నూతన సీడీఓగా అంజనీ రాథోడ్​

author img

By

Published : Feb 9, 2020, 11:51 PM IST

Updated : Feb 29, 2020, 7:42 PM IST

బ్యాంకింగ్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నూతన సీడీఓగా అంజనీ రాథోడ్ నియమితులయ్యారు. ఇటీవలే ఎయిర్​టెల్​ను వీడిన రాథోడ్​.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో కీలక బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

HDFCBANK
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నూతన ముఖ్య డిజిటల్ అధికారి(సీడీఓ)గా అంజనీ రాథోడ్​ను నియమించుకుంది. అంతకు ముందు బ్యాంకు సీడీఓగా నితిన్​ ఛగ్ ఉన్నారు. ఇటీవల ఆయన సీడీఓ బాధ్యతల నుంచి వైదొలిగిన నేపథ్యంలో తాజాగా రాథోడ్​ను ఆ పదవికి ఎంపిక చేసింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.

గత కొంతకాలంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఆన్​లైన్​ బ్యాంకింగ్​కు సంబంధించి పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాథోడ్​ నియామకం తమకు మేలు చేస్తుందని బ్యాంక్ భావిస్తోంది.

రాథోడ్​ నేపథ్యం..

హెచ్​డీఎఫ్​సీకి రాకముందు.. టెలికాం దిగ్గజం భారతీఎయిర్​టెల్​లో ఛీఫ్​ ఇన్ఫర్మేషన్​ ఆఫీసర్​గా పని చేశారు అంజనీ రాథోడ్.

ఐఐటీ-కాన్పూర్​ నుంచి ఎరోస్పేస్​ ఇంజినీరింగ్​లో పట్టాను, ఐఐఎం-కోల్​కతా నుంచి పోస్ట్​ గ్రాడ్యుయేట్​ డిప్లామా పట్టా పొందారు రాథోడ్​.

ఇదీ చూడండి:'పద్దు 2020తో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యస్థకు పునాది'

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/dawoods-close-aide-tariq-parveen-arrested-in-mumbai20200209204628/


Conclusion:
Last Updated :Feb 29, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.