ETV Bharat / business

రష్యా టీకా ఉత్పత్తికి గ్లాండ్​ ఫార్మా ఒప్పందం

author img

By

Published : Mar 16, 2021, 5:23 PM IST

హైదరాబాద్​కు చెందిన గ్లాండ్ ఫార్మా, రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో రష్యా కరోనా టీకా 'స్పుత్నిక్​ వి'.. 25.2 కోట్ల డోసులను గ్లాండ్​ ఫార్మా ఉత్పత్తి చేసి, సరఫరా చేయనుంది.

Gland Pharma to Supply 252 million doses of Sputnik V Vaccines
స్పుత్నిక్​ టీకా సరఫరాకు గ్లాండ్​ ఫార్మా ఒప్పందం

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​ వి' సరఫరాకు సంబంధించి హైదరాబాద్​కు చెందిన గ్లాండ్ ఫార్మా.. రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ (ఆర్​డీఐఎఫ్​)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 25.2 కోట్ల స్పుత్నిక్ వి డోసులను గ్లాండ్​ ఫార్మా ఉత్పత్తి చేసి, సరఫరా చేయనుంది.

హైదరాబాద్​లో కంపెనీకి ఉన్న ఔషధ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు గ్లాండ్​ ఫార్మా వెల్లడించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో టీకాల ఉత్పత్తి ప్రారంభించి.. నాలుగో త్రైమాసికం నుంచి వాటిని డెలివరీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.