ETV Bharat / business

శ్రీరామ్ ట్రాన్స్​పోర్ట్​ ఫినాన్స్​కు ఈడీ రూ.5కోట్ల జరిమానా

author img

By

Published : Mar 10, 2020, 8:11 PM IST

ఓ విదేశీయుడికి వారెంట్లు జారీ చేసిన వివాదంలో శ్రీరామ్ ట్రాన్స్​పోర్ట్​ ఫినాన్స్ కంపెనీకి రూ.5 కోట్ల జరిమానా విధించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​. ఈ వివాదంతో సంబంధమున్న మరో ముగ్గురికి రూ.50 లక్షల చొప్పున జరిమానా వేసింది.

ED slaps Rs 5 cr penalty on Shriram Transport Finance
శ్రీరామ్ ట్రాన్స్​పోర్ట్​కు 5కోట్ల జరిమానా

శ్రీరామ్ ట్రాన్స్​పోర్ట్ ఫినాన్స్ కంపెనీ (ఎస్​టీఎఫ్​సీ)కి రూ.5 కోట్ల జరిమానా విధించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ). వారెంట్ల జారీకి సంబంధించిన ఓ పాత కేసులో ఈమేరకు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించింది.

ఎస్​టీఎఫ్​సీతో 2012 ఏప్రిల్ వరకు భాగస్వామిగా ఉన్న శ్రీరామ్​ హోల్డింగ్స్ (మద్రాస్​) ప్రైవేట్​ లిమిటెడ్(ఎస్​హెచ్​ఎంపీఎల్​).. 2006లో ఓ విదేశీయుడికి రూ.243.6 కోట్లు విలువైన వారెంట్లు జారీచేసింది. తర్వాత వాటిని ఈక్విటీ షేర్లుగా మార్చారు. అయితే ఈ వ్యవహారంలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించారని నిర్ధరిస్తూ జరిమానా విధించింది ఈడీ. ఈ కేసులో అప్పటి ఎస్​హెచ్​ఎంపీఎల్​ డైరెక్టర్లు ముగ్గురికి రూ.50 లక్షల చొప్పున జరిమానా వేసింది.

ఫెమా ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలను ఎస్​టీఎఫ్​సీ తోసిపుచ్చింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంకులో ఐఎంపీఎస్​, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.