ETV Bharat / business

ఆధునిక బ్యాంకింగ్‌ రూపశిల్పి.. ఆదిత్య పురి

author img

By

Published : Oct 27, 2020, 6:49 AM IST

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.. దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్​గా పేరొందడంలో ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా.. ఆదిత్య పురి కృషి ఎనలేనిది. బ్యాంకింగ్ రంగంలో దాదాపు 25 ఏళ్లు సేవలందించిన పురి అక్టోబర్ 26న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ఆయన చేసిన సేవలకు ప్రత్యర్థులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ధన్యవాదాలు తెలిపాయి. దీనిని బట్టి.. ఆదిత్య పురికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న స్థానమేమింటో అర్థమవుతుంది. ఆయన సేవలకు సంబంధించి ఓ ప్రత్యేక కథనం.

Aditya Puri's services in the banking sector
బ్యాంకింగ్ రంగంలో ఆదిత్య పురి సేవలు

"వాచీ పెట్టుకోడు.. జేబులో డబ్బు ఉండదు.. చేతిలో మొబైల్‌ ఫోనూ కనిపించదు.. కానీ.. ఒంటి చేత్తో విశ్వంలోనే ఒక నమ్మకమైన బ్యాంకును నిర్మించారు.. అదీ వివాదాలు లేకుండా.." ఈ ప్రశంసలు చాలు.. ఆ బ్యాంకును ఇన్నాళ్లూ నడిపిన వ్యక్తి గురించి చెప్పేందుకు..

గత దశాబ్ద కాలంలో బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేసిన ఎన్నో కుంభకోణాలు ఆ బ్యాంకు దరిదాపుల్లోకి రాలేదు..అదే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. దాని నాయకుడు ఆదిత్య పురి...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టరు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆయన అక్టోబరు 26న పదవీ విరమణ చేశారు. తాను ఇన్నాళ్లూ తన బ్యాంకుకు అందించిన సేవలకు గుర్తుగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముంబయిలోని తన ప్రధాన కార్యాలయంపై నిలువెత్తు కటౌట్‌ను పెట్టి ధన్యవాదాలు తెలిపింది. పోటీ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా బ్యాంకింగ్‌ రంగానికి అందించిన సేవలకు ధన్యవాదాలు.. మీరు ఎంతోమందికి ప్రేరణ’ అంటూ తన అధికార ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది.

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జన్మించిన ఆదిత్య పురి తాను నిర్మించిన బ్యాంకు ఎంత పటిష్ఠమైనదో.. గణాంకాలే చెబుతాయి.

1990లో దేశానికి తిరిగొచ్చి..

అది 1990 సంవత్సరం.. దేశంలో సరళీకృత ఆర్థిక సంస్కరణలు ప్రారôభమైన సమయం.. మలేసియాలో ఒక విదేశీ బ్యాంకు కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న పురికి ఒక పిలుపు వచ్చింది.. అప్పటికే దేశంలో రుణాల వ్యాపారంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ వ్యవస్థాపకుడు దీపక్‌ పరేఖ్‌.. దేశంలో కొత్త బ్యాంకు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికి సమర్థమైన నాయకుడిగా పురిని ఎన్నుకున్నారు..

అలా విదేశీ బ్యాంకు ఇస్తున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి.. సెంట్రల్‌ ముంబయిలోని ఒక మిల్లు కాంప్లెక్స్‌ నుంచి పనిచేసేందుకు సిద్ధపడ్డారు ఆదిత్య. ఒక ప్రపంచస్థాయి బ్యాంకును సృష్టించేందుకు మంచి బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర బ్యాంకుల మాదిరిగానే ఇది కార్పొరేట్‌ రుణాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా ప్రారంభమైంది. కానీ, ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను వేగంగా గుర్తించి.. రిటైల్‌ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. తక్కువ వడ్డీకి రుణాలను అందించడం, కార్పొరేట్‌ వేతన ఖాతాలను ఆకర్షించడంలాంటివి చేపట్టింది.

నాలుగేళ్లకోసారి రెట్టింపు...

ఆదిత్య పురి నాయకత్వంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త పుంతలు తొక్కడమే కాదు.. ప్రతి నాలుగేళ్లకోసారి రుణ పుస్తకాల్లో లెక్కలు రెట్టింపు అయ్యాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు బ్యాంకు లాభాలు ప్రతి త్రైమాసికంలో దాదాపు 30 శాతం పెరిగాయి. ఇలా 2014 వరకు సాగింది. ఆ తర్వాత బ్యాంకు లాభాలు తగ్గి, పూర్వ గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. కానీ.. ఆర్థిక వ్యవస్థను తమ బ్యాంకు ప్రతిబింబిస్తోందని పురి తనదైన శైలిలో చమత్కారంగా వివరణ ఇచ్చారు.

సాయంత్రం 5.30 గంటలకు రోజును ముగించాలని. ఆ తర్వాత మొబైల్‌ ఫోనునూ వాడొద్దని ఆయన అభిప్రాయం..

రిస్క్‌తో ఉన్న అప్పులపై సమీక్షించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించినప్పుడు అన్ని బ్యాంకులూ ఇబ్బందిపడ్డాయి. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ దానికి అతీతం. కార్పొరేట్‌ ఖాతాలకు అదనంగా కేటాయింపులు చేయాలని ఆర్‌బీఐ సూచించినప్పుడూ.. దానికి వ్యతిరేకంగా అప్పీలు చేసి, సమీక్ష కోరిన బ్యాంకు ఇదే. ఇప్పుడు పురి స్థానంలో జగదీశన్‌ బ్యాంకు పగ్గాలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:పెట్రోల్​, డీజిల్‌పై మరో రూ.8 వడ్డన తప్పదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.