ETV Bharat / business

యూజర్లకు యూట్యూబ్‌ భారీ షాక్‌.. అలా చేస్తే డబ్బులు కట్టాల్సిందే!

author img

By

Published : Dec 30, 2021, 4:59 AM IST

Youtube Offline Video Download: మునుపటిలా యూట్యూబ్​లో వీడియోలను డౌన్​లోడ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!

youtube
యూట్యూబ్‌

Youtube Offline Video Download: ఎప్పుడైనా బోర్‌ కొడితే యూట్యూబ్‌ తెరుస్తాం. కావాల్సినంత సేపు విహరిస్తాం. సాధారణంగా డౌన్‌లోడ్‌ చేసేందుకు మొగ్గు చూపం. అయితే, డేటా వేగంలో ఇబ్బందులున్న వారైతే తమకు కావాల్సిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. తర్వాత నచ్చినప్పుడు చూసుకుంటారు.

రెండు ప్రయోజనాలు..

ఒకటి ఇంటర్నెట్‌ వేగంతో సంబంధం లేదు కాబట్టి వీడియో బఫర్‌ అవుతుందన్న బాధ లేదు. పైగా ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. రెండోది ఆఫ్‌లైన్‌ వీడియోలకు ప్రకటనలు రావు. అయితే, ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి యూట్యూబ్‌ షాకిచ్చింది. మునుపటిలా వీడియోలను హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!

ఇప్పటి వరకు లో, మీడియం, హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ.. ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియో అయినా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉంది. యూట్యూబ్‌ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని సూచిస్తున్న యూట్యూబ్‌.. తాజా నిర్ణయంతో మరింత మందిని సబ్‌స్క్రిప్షన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి : ఐటీఆర్​ ఇ-వెరిఫికేషన్‌ గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.