ETV Bharat / business

ఏటీఎం టచ్​ చేయకుండానే క్యాష్ విత్​డ్రా!

author img

By

Published : Jun 8, 2020, 3:16 PM IST

Withdraw cash at ATMs using your smartphone soon in India
ఏటీఎంను టచ్​ చేయంకుడానే స్మార్ట్​ఫోన్​తో క్యాష్ విత్​డ్రా!

ఏటీఎంను తాకకుండానే మీ స్మార్ట్​ఫోన్​తో నగదు విత్​డ్రా చేసుకునే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ఏటీఎం పిన్ ఎంటర్​ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేస్తే సరిపోతుంది. కార్డ్​లెస్​, టచ్​లెస్ క్యాష్ విత్​డ్రా వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు ఏజీఎస్​ టెక్నాలజీస్ వెల్లడించింది.

ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్​ మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏటీఎంను తాకకుండానే నగదు విత్​డ్రా చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేసింది ఏజీఎస్ ట్రాన్​సాక్ట్ టెక్నాలజీస్​. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. ఈ పద్ధతితో ఏటీఎం పిన్​ను కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్​ఫోన్​తో క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి నగదు విత్​డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ టెక్నాలజీ గురించి బ్యాంకులకు డెమో ఇస్తున్నట్లు చెప్పారు ఏజీఎస్ ట్రాన్​సాక్ట్ టెక్నాలజీస్ ఛైర్మన్​, ఎండీ రవి గోయల్. ఈ సాంకేతికత కోసం బ్యాంకులు అదనంగా వెచ్చించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న సాఫ్ట్​వేర్​ను అప్​గ్రేడ్ చేసుకుంటే సరిపోతుందన్నారు.

ఈ విధానంలో క్యాష్ విత్​డ్రా చేసుకోవాలంటే వినియోగదారులు స్మార్ట్​ఫోన్​లో తమ బ్యాంకుకు సంబంధించిన యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకుని ఉండాలి.

విత్​డ్రా చేసుకునే విధానం...

  • స్మార్ట్​ ఫోన్​లో మీ బ్యాంకు యాప్​ ఓపెన్ చేసి క్యూఆర్​ కోడ్ విత్​డ్రాయల్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకోవాలి. ఎంత నగదు కావాలో ఫోన్లోనే ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత ఏటీఎంపై ఉన్న క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేయాలి.
  • ఎమౌంట్​ను కన్ఫర్మ్​ చేస్తూ యాప్​లో ప్రోసీడ్ ఆప్షన్​ను ఎంచుకోవాలి. యాప్​లో ఉపయోగించే ఎం-పిన్​ను ఎంటర్​ చేసి లావాదావీ పూర్తి చేయాలి. ఏటీఎం నుంచి నగదు, రసీదు తీసుకోవాలి.​

వినియోగదారులకు క్యాష్ విత్​డ్రా సదుపాయాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏజీఎస్ తెలిపింది. కార్డ్​లెస్ విధానంతో భద్రతతో పాటు ఏటీఎం కార్డులతో జరిగే మోసాలకు అడ్డుకట్టపడుతుందని పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72వేల ఏటీఎం యంత్రాలను నిర్వహిస్తోంది ఏజీఎస్​. ప్రముఖ బ్యాంకులకు అవసరమైన సాంకేతిక సేవలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్​ ఇండియా భాగస్వామ్యంతో ఇప్పటికే యూపీఐ-క్యూఆర్​ ఆధారిత క్యాష్​ విత్​డ్రా విధానాన్ని ప్రవేశపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.