ETV Bharat / business

కొత్తదా? పాతదా? ఆ విషయంలో ఏ కారు ఉత్తమం​?

author img

By

Published : Jul 11, 2021, 9:30 AM IST

Updated : Jul 11, 2021, 12:15 PM IST

కార్ల కొనుగోలుకు ఇటీవల కాలంలో చాలా మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో కొత్త వాటితో పాటు ఉపయోగించిన కార్లకు కూడా డిమాండ్ పెరిగింది. రెండింటిలో వేటిని కొనుగోలు చేయటం మేలు? ఉపయోగించిన కార్లు కొనేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఏ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయి? వంటి వివరాలు మీకోసం.

USED CARS VS NEW CARS
కొత్త కారు, పాత కారు

కరోనా వల్ల కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రజా రవాణా ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. అందరికీ కొత్త కారు కొనుగోలు చేసే స్థోమత ఉండదు. అలాంటి వారు.. ఉపయోగించిన కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొత్త కారు కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఉపయోగించిన కారు కొనుగోలుకు కూడా ఈ సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. మరికొన్ని అయితే ఉపయోగించిన కారు కొనుగోలుకు 100 శాతం రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

ఏది బెటర్…

కొత్త కారు కంటే ఉపయోగించిన కారుకు రుణం తక్కువ ఇస్తారు. వడ్డీ కూడా తగ్గుతుంది. అయితే కొత్త దానితో పోల్చితే పాత కారుకు ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. పాత కారు విషయంలో తిరిగి చెల్లించేందుకు బ్యాంకులు ఎక్కువ గడువు ఇస్తున్నాయి.

పాత కారుకు కొన్ని రుణ పరిమితులు ఉన్నాయి. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పాత వాహనాలకు రుణం అందించేందుకు మొగ్గు చూపవు. బీమా మొత్తాన్ని రుణంలో భాగంగా ఇవ్వవు.

కొత్త కారు వల్ల లాభాలు..

కొత్త కారు కొనుగోలు చేసినట్లయితే.. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. మొదటి సంవత్సరం నిర్వహణ ఖర్చు లేకుండా ఆయా వాహన కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. పాత కారు కొనుగోలు చేసినట్లయితే నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ తరచూ మార్చాల్సి ఉంటుంది.

పాత కారు విషయంలో విడిభాగాలకు రిపేరు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొత్త కారులో ఈ ఖర్చు దాదాపు తక్కువగా ఉంటుంది. కొత్త కారులో ఉపయోగించే టెక్నాలజీ, ఫీచర్లు అధునాతనంగా ఉంటాయి. పాత కారులో ఆ సాంకేతిక ఉండకపోవచ్చు.

పాత కారు..

పాత కారు కొనుగోలు చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, ఆర్టీఓ ఫీజులు తదితరాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త కారుతో పోల్చితే కొన్నేళ్లు ఉపయోగించిన కారు ధర తక్కువగా ఉంటుంది. కొత్త కారు 20 శాతం ధర తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో 60 శాతం తగ్గిపోతుంది. అంటే 40 శాతం ధరకే మూడేళ్లు ఉపయోగించిన కారును సొంతం చేసుకోవచ్చు.

వడ్డీ రేట్లు..

ఉపయోగించిన కారు రుణార్హత నిబంధనలు బ్యాంకును బట్టి మారుతుంటాయి. ప్రముఖ బ్యాంకులు.. ఉపయోగించిన కార్లపై అందిస్తున్న రుణంపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.5%-10.5%
  • ఐసీఐసీఐ బ్యాంకు 12%-14%
  • టాటా క్యాపిటల్ 15% నుంచి ప్రారంభం
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 13.75% నుంచి 16 శాతం
  • యాక్సిస్ బ్యాంక్ 14.25%-16.25%
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.3% నుంచి ప్రారంభం

ఇదీ చూడండి: ల్యాప్​టాప్​ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి

Last Updated :Jul 11, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.