ETV Bharat / business

ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్​ మరో ఫీచర్​

author img

By

Published : Mar 4, 2021, 5:30 AM IST

Updated : Mar 4, 2021, 9:41 AM IST

twitter-rolliing-out-new-feature-for-android-users
ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్​ మరో ఫీచర్​

ట్విట్టర్ ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ఐవోఎస్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న 'స్పేసెస్' ఫీచర్​ను వీరికీ అందించనుంది. ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఎక్కువగా వినియోగించే భారత్‌ లాంటి దేశాల్లో యూజర్ల కోసం ఆడియో చాట్‌ ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని సంస్థ పేర్కొంది

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ట్విట్టర్‌ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకుముందు ఆడియో చాట్ కోసం ఐవోఎస్‌ యూజర్లకు అందించిన ‘స్పేసెస్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకూ అందించనుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఎక్కువగా వినియోగించే భారత్‌ లాంటి దేశాల్లో యూజర్ల కోసం ఆడియో చాట్‌ ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని పేర్కొంది. ‘‘ఆండ్రాయిడ్‌ యూజర్లూ..! స్పేసెస్‌ ఫీచర్‌కు సంబంధించి బీటా వెర్షన్‌ను ప్రారంభించాం. త్వరలో స్పేస్‌లో జాయిన్‌ అయ్యి మాట్లాడుకోండి. మీరు సొంతంగా క్రియేట్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి.. కొన్ని అంశాలపై టెస్టింగ్‌ చేస్తున్నాం. లైవ్‌ స్పేస్‌ కోసం వేచి చూస్తూ ఉండండి. త్వరలోనే కలుద్దాం..’’ అని ట్వీట్‌ చేసింది.

ఎలా చేయాలంటే..?

వాట్సాప్‌లో ఆడియో సందేశాన్ని పంపించేందుకు ఎలాంటి అవకాశం ఉందో.. అలాగే ట్విట్టర్లోనూ అలాంటి ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లకు రాబోతోంది. ట్విట్టర్ యాప్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ట్వీట్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. మెసేజ్ బాక్స్‌ కుడివైపున వాయిస్‌ సింబల్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే మైక్‌ వస్తుంది. మైక్‌ను అలానే ప్రెస్‌ చేసి పట్టుకుని మనం చెప్పాలనుకున్నది మాట్లాడాలి. వాయిస్‌ లిమిట్‌ కేవలం 140 సెకన్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోబ్లాగ్‌గా పేరొందిన ట్విట్టర్​కు భారత్‌లో 1.75 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. అందులోనూ ఎక్కువగా ఆండ్రాయిడ్‌ యూజర్లే ఉన్నారు.

ఇదీ చూడండి: ఎక్కువ బ్యాంక్​ ఖాతాలు ఉంటే నష్టాలివే...

Last Updated :Mar 4, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.