ETV Bharat / business

భారత్​లో టెస్లా కార్లకు.. అదే అడ్డంకి!

author img

By

Published : Jul 24, 2021, 5:05 PM IST

Tesla CEO Musk
ఎలాన్​ మస్క్​

ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమైంది. అయితే.. దిగుమతి చేసుకునే వాహనాలు మార్కెట్లో విజయం సాధిస్తేనే తయారీ యూనిట్​ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్​ మెలికపెట్టారు. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాలపైనే స్పందించారు.

అమెరికా విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్ తాజాగా​ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దిగుమతి చేసుకునే వాహనాలతో మంచి ఫలితాలు వస్తే.. తయారీ యూనిట్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే.. ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు భారత్​లో ఉన్నాయని, కనీసం విద్యుత్​ వాహనాలకు తాత్కాలిక ఉపశమనమైనా ఉంటుందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

భారత మార్కెట్లోకి టెస్లా కార్లను తీసుకొచ్చే విషయంలో ఓ ఫాలోవర్​ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్​లో సమాధానమిచ్చారు మస్క్​.

Tesla CEO Musk
ఫాలోవర్​ ట్వీట్​కు రిప్లై ఇచ్చిన మస్క్​

"మేము భారత్​లో విడుదల చేయాలనుకుంటున్నాం. కానీ, ఏ పెద్ద దేశంతో పోల్చినా.. ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు భారత్​లో ఉన్నాయి. భారత్​లో డీజిల్​, పెట్రోల్​ వాహనాలతో సమానంగా పర్యావరణ హిత వాహనాలను పరిగణిస్తున్నారు. అది వాతావరణ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అయితే.. ఎలక్ట్రిక్​ వాహనాలపై సుంకాల విషయంలో కనీసం తాత్కాలిక ఉపశమనమైనా ఉంటుందని ఆశిస్తున్నాను."

- ఎలాన్​ మస్క్​, టెస్లా సీఈఓ

దిగుమతి సుంకాలు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కోరినట్లు సీనియరి అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ సైతం భారత మార్కెట్లోకి టెస్లా వస్తున్నట్లు ప్రకటించారు. భారత్​ ఈ-వెహికిల్స్​కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న క్రమంలో టెస్లాకు అది సువర్ణావకాశం అని పేర్కొన్నారు. అటు తమ రాష్ట్రంలో టెస్లా యూనిట్​ ఏర్పాటు చేయబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించారు.

భారత్​లో.. ఆ సంస్థ ఇప్పటికే టెస్లా ఇండియా మోటర్స్​ అండ్​ ఎనర్జీ ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో నమోదు చేసుకుంది.

ఆ వాహనాలపై 100 శాతం..

ప్రస్తుతం భారత్​.. పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే కార్లపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. అయితే.. 40వేల డాలర్లకన్నా తక్కువ ధర ఉన్నవాటికి 60 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.

ఇదీ చూడండి: చెప్పినట్టే భారత్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాం: టెస్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.