ETV Bharat / business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు- 53 వేల పైకి సెన్సెక్స్

author img

By

Published : Jul 23, 2021, 9:42 AM IST

Updated : Jul 23, 2021, 12:51 PM IST

stock market live updates
స్టాక్ మార్కెట్​ లైవ్ అప్డేట్స్​

12:46 July 23

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా పెరిగి..53,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంతో 15,870 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్​సీఎల్​టెక్, భారతీ ఎయిర్​టెల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:33 July 23

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ ముందు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 15 పాయింట్లకుపైగా లాభంతో 52,853 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 15,828 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

  • హెచ్​సీఎల్​టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్​ ఆటో, ఏషియన్​ పెయింట్స్, ఎన్​టీపీసీ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

10:23 July 23

తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన జొమాటో లిమిటెడ్‌ షేర్లకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒక్కో షేరు ధర రూ.116గా ఉంది.

10:08 July 23

సల్వ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్​ 70 పాయింట్లు పెరిగి  52,907 చేరింది. నిఫ్టీ 10 పాయింట్లు మెరుగుపడి 15,834  వద్ద ట్రేడవుతోంది.

జొమాటో లిమిటెడ్‌ షేర్లు నేడు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. దీంతో మదుపర్లంతా ఈ షేరు కదలికలపై దృష్టి సారించారు. ఈ రంగానికి భవిష్యత్తుల్లో మంచి వృద్ధి ఉందన్న అంచనాల నేపథ్యంలో జొమాటోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా చాలా ఫిన్‌టెక్‌ సంస్థలు ఐపీఓకు రానున్న నేపథ్యంలో జొమాటో వాటికి బూస్ట్‌ ఇవ్వనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

09:07 July 23

stock market live updates

స్టాక్​ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు కోల్పోయి 52,800కి చేరింది. నిఫ్టీ 17 పాయింట్లు క్షీణించి 15,806 వద్ద ట్రేడ్​ అవుతోంది.

టాటా స్టీల్, హెచ్​సీఎల్ టెక్. అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టెక్​ మహీంద్రా, టాటా మొటార్స్, హెచ్​యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated : Jul 23, 2021, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.